
బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శకం ముగిసింది. రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమైన ఆయన రాష్ట్ర రాజకీయాలు, సిఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో బిహార్ కొత్త సిఎంపై ఉత్కంఠ నెలకొంది. ఈక్రమంలో తొలిసారి బిజెపి నేత బిహార్ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
బిహార్ సిఎంగా ఒక బిసి నేతను పెట్టేందుకు బిజెపి యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో సిఎం పదవి కోసం పలువురు బిజెపి నేతలు పోటిపడుతున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త సిఎం పదవిపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం పాట్నాకు వెళ్లేనున్నట్లు తెలుస్తోంది. కాగా, రికార్డు స్థాయిలో పదొసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీశ్ కుమార్.. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.