Reading Time: < 1 minute

కెపిహెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్‌ఓటీ పోలీసులు ఆదిత్యనగర్‌ అడ్డగుట్టలోని ఒక ప్రైవేట్ లగ్జరీ స్టే ఇన్ గదిపై దాడి చేశారు. గదిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని, తదుపరి చర్యల కోసం కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. దేవలరాజు వెంకట శేష చలం (48), పార్వతనేని వీరభద్రరావు (47), పెడ్డినేని పవన్ కుమార్ (36), ఓబిలినేని గణేష్ (36), పార్వతనేని రాంబాబు (45) పట్టుబడిన వారిలో ఉన్నారు.వారి వద్ద నుంచి రూ.39,010 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, ఆరు సెట్‌ల పేకాట కార్డులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.89,010/- గా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు