Reading Time: < 1 minute

కోల్‌కతా: ఐసిసి టి-20 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌లు ఒక ఎత్తైతే.. ఇకపై జరిగే మ్యాచ్‌లో మరింత ఉత్కంఠగా ఉండనున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు దూసుకుపోతుంది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టులో మూడు మార్పు చేసింది. రబాడా, మార్కో జెన్సన్, కేశవ్ మహరాజ్‌లను జట్టులోకి తీసుకుంది. న్యూజిలాండ్ రెండు మార్పులు చేసింది. మ్యాచ్ హెర్నీ, నీశమ్‌లను జట్టులోకి తీసుకుంది.

తుది జట్లు:

సౌతాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి.

న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(కీపర్), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కోల్ మెక్‌కాంచీ, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్.