
తిరుమల వెంకన్నను దర్శించుకోవాలన్న ఆ కుటుంబ ఆశలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. పుణ్యక్షేత్రానికి వెళ్తున్న ప్రయాణం మృత్యులోకానికి తీసుకెళ్లింది. చిత్తూరు జిల్లాలోని పలమనేరు శివారులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం పలమనేరు జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని ఓ కారు వెనుక వైపు నుంచి అత్యంత వేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటన లో ఆ కారు పూర్తిగా ధ్వంసమైంది.
మృతులు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలోని రాజాజీ నగర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించా రు. ఈ ప్రమాదంలో మరణించిన వారి వివరాలను పోలీసులు అధికారికంగా ప్రకటించారు. మృతుల్లో వృద్ధులతోపాటు యువతులు కూడా ఉన్నా రు. మోహన్‌దాస్, నాగరాజారా వు, కుసుమ, జయంతి, పూజ మృతి చెందారు. ఒకేసారి కుటుంబంలోని, బంధువర్గంలోని ఐదుగురు వ్యక్తులు మరణించడంతో రాజాజీనగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. పలమనేరు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవం తం చేశారు. ప్రాథమిక దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రాథమిక విచారణ ప్రకారం కారు డ్రైవర్ అతి వేగంగా వాహనం నడపడం వల్లే ఈ ప్ర మాదం జరిగినట్టు తెలుస్తోంది. వేగం ఎక్కువగా ఉండటం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ముందు వెళ్తున్న లారీని గమనించ లేక ఢీ కొట్టి నట్టు పోలీసులు భావిస్తున్నారు.