Reading Time: < 1 minute

హైదరాబాద్ లోని ఎంజిబిఎస్ బస్ స్టేషన్ లో తెలంగాణ ఆర్టీసీ దేశంలోనే మొట్టమొదటిసారిగా  “జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆన్ వీల్స్”  ద్వారా గుర్తించిన సాంస్కృతిక ,కళాత్మక చిత్రాలతో రూపొందించిన బస్సులను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్  జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ టిసి ఎండి నాగిరెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, ఆర్ టిసి అధికారులు, తదితరలు పాల్గొన్నారు. బస్సులపై జిఐ ఆర్ట్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ కళలు చేతిపనులపై అవగాహనను తీసుకొస్తుందని, పర్యాటక అభివృద్ధి చేతివృత్తులవారిని ప్రోత్సహిస్తుంది. జిఐ ఆర్ట్ వర్క్ ఉన్న ఆరు జిల్లాలకు ఆరు ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రారంభించారు.