
హైదరాబాద్: పేదల ఇళ్లు కూల్చితే..మీ ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చుతారని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. ఖమ్మంలో మంత్రుల తీరు దారుణంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల ఇళ్లు కూలగొట్టి కబ్జా చేస్తారా? అని.. కట్టాల్సింది పోయి..కూల్చడంలో పోటీ పడతారా? అని బండి ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎమ్ఐఎమ్ డ్రామాలు ఎవరూ నమ్మరని, బిఆర్ఎస్ మార్గంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. రైతు భరోసా ఇస్తామని రైతులను సిఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. మాసీ సిఎం కెసిఆర్ ను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డికు లేదని బండి సంజయ్ పేర్కొన్నారు.