Reading Time: 2 minutes

IRUMUDI OTT: ఓటీటీలోకి రవితేజ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Caption of Image.

మాస్ మహారాజా రవితేజ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఇరుముడి’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుని సూపర్‌హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఇరుముడి’.. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 18 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ కేటలాగ్‌లోనూ కనిపిస్తుంది. అలోమోస్ట్ సెప్టెంబర్ 18 నుంచే స్ట్రీమింగ్ అని ఇండస్ట్రీ వర్గాలు సైతం తెలిపాయి.

ముఖ్యంగా రవితేజ, చిన్నారి నక్షత్ర మధ్య సాగే తండ్రీకూతుళ్ల ఎమోషన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కథలోని ఎమోషన్, థ్రిల్లింగ్ అంశాలకు ఆడియన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆగష్టు 21 నుంచి రోజురోజుకూ మౌత్ టాక్ రెట్టింపు అవ్వడంతో జనాలు క్యూ కట్టారు. దీంతో రవితేజ కెరీర్‌లో ప్రత్యేకమైన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ‘ఇరుముడి’ నిలిచింది. అంతేకాకుండా నెలరోజుల పాటు థియేటర్లలోనే కాకుండా సోషల్ మీడియా రీల్స్లో లోనూ ఇరుముడి దుమ్మురేపింది. ఇప్పుడు ఓటీటీల ద్వారా ఇంట్లోకి వచ్చి పూనకాలు తెప్పించడానికి రెడీ అయింది.

ఐదు రెట్ల వరకు లాభాలు..

సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ.275 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. పెట్టిన పెట్టుబడిపై ఏకంగా నాలుగు నుంచి ఐదు రెట్ల వరకు లాభాలు అందిస్తూ రూ.100 కోట్లకు పైగా నెట్ ప్రాఫిట్ సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ‘ఇరుముడి’ విజయ ప్రస్థానం అసాధారణంగా నిలిచింది.

సోలో హీరో చిత్రంగా నైజాంలో సుమారు రూ.53 కోట్లకు పైగా షేర్ రాబట్టడం రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైలురాయిగా నిలిచింది. గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు భారీగా తరలిరావడం.. ఈ స్థాయి వసూళ్లు సాధించడానికి ప్రధాన కారణంగా నిలిచింది.

©️ VIL Media Pvt Ltd.