Reading Time: < 1 minute

తిరుప‌తిలో విద్యార్థులు, విద్యార్థి నాయకుల అరెస్ట్.. యువతి జట్టు పట్టుకుని ఈడ్చిన పోలీసులు..!

Caption of Image.

తిరుపతిలో ఉద్రిక్తత నెలకొంది. స్టైఫండ్ ఇవ్వాలంటూ అలిపిరి దగ్గర పారా మెడికల్ విద్యార్థులు శనివారం (సెప్టెంబర్ 12) రోడ్డుపై బైఠాయించారు. ట్రాఫిక్‎కు అంతరాయం కలిగిస్తున్నారన్న కారణంతో పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. దీంతో విద్యార్థులు, విద్యార్థి సంఘం లీడర్లను పోలీసులు అరెస్ట్ చేసి తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‎కు తరలించారు. 

పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని.. కొందరు యువతులను జట్టు పట్టుకుని ఈడ్చారని విద్యార్థులు ఆరోపించారు. నిరసన వ్యక్తం చేస్తోన్న విద్యార్థుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. పోలీసుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.