Reading Time: < 1 minute

Aadarsha Kutumbam Teaser: వెంకీ-త్రివిక్రమ్ ‘AK47’ అప్డేట్.. టీజర్ రిలీజ్‌పై అధికారిక ప్రకటన

Caption of Image.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నం. 47’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్రబృందం టీజర్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది.

ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్.. “ఎంటర్‌టైన్‌మెంట్ మరింత నెక్ట్స్ లెవల్‌కు వెళ్లబోతోంది!” అంటూ టీజర్‌పై ఆసక్తిని పెంచారు. రేపు సెప్టెంబర్ 12న మధ్యాహ్నం 12 గంటలకు ‘ఆదర్శ కుటుంబం హౌస్ నం. 47’ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

కాగా, ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. టీజర్ రిలీజ్‌కు మరికొద్ది గంటలే సమయం ఉండటంతో వెంకీ అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

త్రివిక్రమ్ డార్క్ క్రైమ్..

సాధారణంగా కుటుంబ కథలు, ఎమోషన్స్, పంచ్ డైలాగ్స్‌తో సినిమాలు చేసే త్రివిక్రమ్, ఈసారి “AK47” అనే టైటిల్ టచ్‌తో డార్క్ క్రైమ్ ఎలిమెంట్స్‌పై కూడా ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఇలాంటి డార్క్ షేడ్స్ ఉన్న పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారని టాక్ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. అలాగే, ఈ సినిమాలో దివ్యేందు శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మరో ఇంపార్టెంట్ రోల్ లో హీరో నారా రోహిత్ కూడా కనిపించనున్నారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన నటించనున్నారని, కథలో ఇది చాలా ముఖ్యమైన క్యారెక్టర్ అని సమాచారం. 

©️ VIL Media Pvt Ltd.