Reading Time: < 1 minute

ఆవు పేడతో వినాయక విగ్రహాలు.. ఖమ్మం జిల్లాలో వినూత్న ప్రయోగం

Caption of Image.

వెలుగు ఫోటోగ్రాఫర్, ఖమ్మం :పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఖమ్మం నగరంలోని టేకులపల్లి గోశాల నిర్వాహకులు శ్రీనివాసాచార్యులు గోపేడతో తయారు చేస్తున్న వినాయక విగ్రహాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ఆవుపేడతో పాటు చెక్క పొట్టు, ముల్తానీ మట్టి కలిపి 10 ఇంచుల నుంచి రెండు అడుగుల విగ్రహాల వరకు తయారు చేస్తున్నారు. అనంతరం పర్యావరణానికి హాని చేయని రంగులను అద్దుతున్నారు. ఈ విగ్రహాలను నిమజ్జనం చేసిన 25 రోజుల తర్వాత కరిగిపోతాయని, అనంతరం మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.  – 

©️ VIL Media Pvt Ltd.