Reading Time: < 1 minute

గద్వాల: ‘గూడెందొడ్డి’ సామర్థ్య పెంపునకు గ్రీన్ సిగ్నల్

Caption of Image.

గద్వాల, వెలుగు:  ధరూర్ మండలంలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ఫేజ్-1 పరిధిలోని గూడెందొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల గద్వాల జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీఎస్‌‌‌‌‌‌‌‌పీ మోడల్‌‌‌‌‌‌‌‌లో, సోలార్ పవర్ జనరేషన్‌‌‌‌‌‌‌‌తో అనుసంధానం చేసి చేపట్టనున్న ఈ ప్రాజెక్టు సర్వే, అధ్యయనాల కోసం రూ.15 కోట్లు, 1,100 ఎకరాల భూసేకరణ కోసం రూ.165 కోట్లు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 

ఈ మేరకు జీవో కాపీని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందుకున్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేలా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంతో గద్వాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.