
ప్రస్తుతం ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. మనం మాట్లాడుకుంటున్న ఒక థ్రిల్లర్ డ్రామా అందరిని చివరి వరకు కట్టిపడేస్తుంది. ఊహించని మలుపులు ఆద్యంతం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చెన్నైలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మూడేళ్ల బాలిక అదృశ్యమవుతుంది. ఆమెను ఎవరు అపహరించారు? పోలీసులు నిందితుడిని సంప్రదించారా లేదా? అన్నదే ఆ సినిమా కథాంశం. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు కాళిదాస్ 2. శ్రీ సెంథిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో భరత్, అపర్ణతి, భవానీ శ్రీ, ప్రకాష్‌రాజ్, కిషోర్ కీలకపాత్రలు పోషించారు. ‘కాళిదాస్ 2’ గత ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలైంది. అయితే థియేటర్లలో అంతగా రెస్పాన్స్ రాకపోయినప్పటికీ ప్రస్తుతం ఓటీటీలో దుమ్మురేపుతుంది. వారాంతంలో ఓటీటీలో సినిమా చూడాలనుకునే వారికి, ముఖ్యంగా థ్రిల్లర్ ప్రియులకు ఈ చిత్రం ఒక మంచి ఎంపిక కావచ్చు.
ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..
ఒక అపార్ట్‌మెంట్ భవనంలో నూతన సంవత్సర వేడుకల సమయంలో ఒక అమ్మాయి అదృశ్యమవుతుంది. ఆమెను అపహరించింది ఆ అపార్ట్‌మెంట్‌లోని యువకుడేనని అనుమానం కలుగుతుంది. పోలీసులు అతడిని అరెస్టు చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేదే కథ. ఇది చాలా సరళమైన కథ అయినప్పటికీ, దర్శకుడు దీనిని అనేక పొరలున్న కథనంగా మలిచారు. పిల్లవాడికి సంబంధించిన దర్యాప్తు ప్రారంభం కాగానే ఉత్సాహం మొదలవుతుంది. తర్వాతి సన్నివేశాల్లోని మలుపులు, దర్యాప్తులోని ఆసక్తికరమైన సమాచారం సినిమాను విసుగు పుట్టించకుండా ముందుకు నడిపిస్తాయి. క్లైమాక్స్ వరకు అనూహ్యంగా కొనసాగే మలుపే ఈ సినిమాకు బలం.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..
ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. 2019లో విడుదలైన ‘కాళిదాస్’ సినిమా మొదటి భాగం జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సినిమా విడుదలై అభిమానుల నుంచి మంచి స్పందనను అందుకుంది. దీని కారణంగానే రెండో భాగం విడుదలైంది. థ్రిల్లర్ అభిమానులకు ‘కాళిదాస్’ రెండు భాగాలు ఒక విందు లాంటివి. వారాంతంలో ఓటీటీలో చూడటానికి ఇది చాలా అనువైన సినిమా.
ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..
ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..