Reading Time: 3 minutes

Mahendragiri Varahi Review: 33ఏళ్లకే మరణం.. ఊహించని ట్విస్టులు.. కాంతారా, విరూపాక్షతరహాలో సుమంత్ మూవీ!

Caption of Image.

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’ (Mahendragiri Varahi). హీరో సిద్దు జొన్నలగడ్డ మరో పవర్ ఫుల్ పాత్రలో నటించాడు. మీనాక్షి గోసామి హీరోయిన్. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాను సంతోష్ జాగర్లపూడి డైరెక్ట్ చేయగా, మధు, లక్ష్మణ్ కలిసి నిర్మించారు.

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇవాళ శుక్రవారం (సెప్టెంబర్ 11, 2026న) భారీ అంచనాలతో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్, ట్రైలర్‌‌‌‌‌‌‌‌తో పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ‘మహేంద్రగిరి వారాహి’, ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్ ఇచ్చింది? కాంతారా, కార్తికేయ, విరూపాక్ష లాంటి సినిమాల జాబితాలో ‘మహేంద్రగిరి వారాహి’ కూడా చేరుతుందా? లేదా? అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.. 

కథేంటంటే..

మహేంద్రగిరి.. ఆ కొండల్లో కొలువైన వారాహి అమ్మవారికి ఎంతో విశిష్టమైన చరిత్ర ఉంటుంది. అయితే అదే ఊరిని, అక్కడి రాజవంశాన్ని ఏళ్లుగా ఓ భయంకరమైన మిస్టరీ వెంటాడుతుంటుంది. ఆ వంశంలో పుట్టిన ప్రతి మగ వారసుడు 33 ఏళ్లు నిండగానే అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతుంటాడు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపు 150 ఏళ్లుగా ఇదే తంతు కొనసాగుతుంటుంది.

ALSO READ : ‘90’s ఫేమ్ ఆదిత్య హాసన్ ‘ఎపిక్’ రివ్యూ..

దీంతో తమ పూర్వీకులు చేసిన ఓ తప్పుకు కోపించిన వారాహి అమ్మవారు ఆ రాజవంశాన్ని శపించిందని గ్రామస్తులు నమ్ముతుంటారు. తరతరాలుగా జరుగుతున్న ఈ మరణాలకు దైవ శక్తినే కారణంగా భావిస్తూ భయంతో జీవిస్తుంటారు. కానీ.. నిజంగానే భక్తులను కాపాడే అమ్మవారు ఓ వంశాన్ని ఇలా శపిస్తుందా? 33 ఏళ్లకే మగ వారసుల ప్రాణాలు పోవడం వెనుక అసలు రహస్యం ఏంటి?

ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే క్రమంలో సిద్ధార్థ్ (సుమంత్) రంగంలోకి దిగుతాడు. మొదట సాధారణంగా కనిపించిన ఈ మిస్టరీని ఛేదించే కొద్దీ అతడికి ఊహించని నిజాలు ఎదురవుతాయి. రాజవంశం గతం, వారాహి అమ్మవారి మహిమ, తరతరాలుగా దాచిపెట్టిన రహస్యాలు.. ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటాయి.

అయితే ఈ అన్వేషణలో సిద్ధార్థ్‌కు అర్థమయ్యే విషయం ఒక్కటే.. తాను ఛేదించేది కేవలం వరుస మరణాల మిస్టరీ కాదు.. 150 ఏళ్లుగా నిజమని నమ్ముతున్న ఓ భయంకరమైన కథను.

అసలు ఆ రాజవంశానికి వారాహి అమ్మవారు నిజంగానే శాపం పెట్టిందా? లేక ఈ మరణాల వెనుక మరేదైనా కారణం ఉందా? ఈ రహస్యాన్ని సిద్ధార్థ్ ఎలా ఛేదించాడు? వారాహి అమ్మవారి దివ్యశక్తి ఈ మిస్టరీలో ఎలాంటి పాత్ర పోషించింది? చివరికి 150 ఏళ్లుగా కొనసాగుతున్న ఆ మరణాల పరంపర వెనుక దాగిన నిజం ఏమిటి? అనేదే ‘మహేంద్రగిరి వారాహి’ అసలు కథ.

విశ్లేషణ:

డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి ఎంచుకున్న పాయింట్ చాలా రక్తి కట్టించేలా ఉంది. దైవత్వం, భయం, మిస్టరీ, శాపాలు అనే అంశాలను ముడిపెట్టి రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ముఖ్యంగా 150 ఏళ్లుగా ఓ రాజవంశాన్ని వెంటాడుతున్న శాపం, ప్రతి మగ వారసుడి 33 ఏళ్లకే మరణం అనే పాయింట్ కథపై ఆసక్తిని పెంచుతుంది. ముఖ్యంగా “కాపాడే అమ్మవారే ఓ వంశాన్ని ఎందుకు శపించింది?” అనే ప్రశ్నను కథకు ప్రధాన బలంగా మార్చుకోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది.

ALSO READ ;  దున్నపోతు చుట్టూ ఇంత కథ ఉందా?.. ‘మారెమ్మ’ మూవీ ఎలా ఉందంటే..

కథ మొదలైన దగ్గరి నుంచి దర్శకుడు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేశాడు. వారాహి అమ్మవారి చుట్టూ ఉన్న దైవిక విశ్వాసాలు, రాజవంశం గతం, వరుస మరణాల మిస్టరీ.. ఇలా ఒక్కో అంశాన్ని కలుపుతూ కథను ముందుకు తీసుకెళ్లాడు. హీరో సుమంత్ ఈ మిస్టరీని ఛేదించే క్రమంలో ఎదుర్కొనే పరిణామాలు కథకు థ్రిల్‌ను పంచుతాయి.

అయితే ఈ కథలో మరింత ఆసక్తి కలిగించే అంశం.. వరుస మరణాల వెనుక దేవత శాపమా? లేక శాపం పేరుతో మరేదైనా జరుగుతోందా? అన్నదే. ఈ ప్రశ్న ప్రేక్షకుడిని వెంటాడేలా చేస్తుంది. మొత్తంగా ‘కాంతార’, ‘కార్తికేయ’, ‘విరూపాక్ష’ తరహాలో దైవిక శక్తి చుట్టూ ఓ మిస్టరీని అల్లుకుని, దానికి యాక్షన్, ఎమోషన్, థ్రిల్‌ను జోడించే ప్రయత్నంగా ‘మహేంద్రగిరి వారాహి’ కనిపిస్తుంది. కథలోని 150 ఏళ్ల శాపం, 33 ఏళ్ల మరణ రహస్యం, వారాహి అమ్మవారి దివ్యశక్తి.. ఈ మూడు అంశాలే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి.

నటీనటుల పెర్ఫార్మన్స్..

సుమంత్ పోషించిన సిద్ధార్థ్ పాత్ర కథకు కీలకంగా నిలుస్తుంది. మిస్టరీని ఛేదించే వ్యక్తిగా మాత్రమే కాకుండా, గతానికి సంబంధించిన అనేక రహస్యాలను వెలికితీసే పాత్రలో ఆకట్టుకున్నాడు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి గోస్వామి పాత్రలు కథలో ఎలాంటి మలుపులు తీసుకొస్తాయన్నది కూడా ఆసక్తిని పెంచుతుంది. ఇక సిద్దు జొన్నలగడ్డ పవర్‌ఫుల్ క్యామియో సినిమాకు హైలైట్‌గా నిలిచి, సెకండ్ హాఫ్‌లో మాస్ ఎలిమెంట్‌ను తెస్తుంది.  

టెక్నీకల్గా..

అనూప్ రూబెన్స్ BGM సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ముఖ్యంగా దైవిక, యాక్షన్ సన్నివేశాలకు ఆయన అందించిన స్కోర్ మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ మహేంద్రగిరి ప్రకృతి అందాలను, దైవిక వాతావరణాన్ని ఆకట్టుకునేలా చూపించింది. నిర్మాణ విలువలు కూడా రిచ్‌గా ఉన్నాయి. ఇక లాస్ట్ బట్ నాట్ లిస్ట్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి.. ‘సుబ్రహ్మణ్యపురం’ మూవీ తర్వాత మరోసారి దైవిక, మిస్టరీ అంశాలను ఎంచుకుని, సోషియో-ఫాంటసీ, మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచే ట్విస్టులు, ఊహించని సన్నివేశాలు రాసుకుని ఇంప్రెస్ చేశాడు.

©️ VIL Media Pvt Ltd.