Reading Time: 2 minutes

ఖైరతాబాద్ బడా గణేష్: రేపటి (సెప్టెంబర్ 12) నుంచే ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!

Caption of Image.

హైదరాబాద్ సిటీలో వినాయక చవితి సందడి మొదలైంది. గల్లీ గల్లీలో గణేష్ మండపాల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. గణేష్ పండుగ అంటేనే గుర్తొచ్చే ఖైరతాబాద్ గణేష్ విగ్రహ ప్రతిష్ట ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.  బడా గణేష్ దర్శనానికి భక్తులు భారీగా తరలిరానుండటంతో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నారు పోలీసులు. సెప్టెంబర్ 12 నుంచి 24 వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి. 

ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు అవసరాన్ని బట్టి ఆంక్షలు ఉంటాయని ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పలు మార్గాల్లో డైవర్షన్స్ ఉండనున్నాయి. 

  • వీవీ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలు రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర నిరంకారి జంక్షన్ వైపు మళ్లించనున్నారు. 
  • పాత పీఎస్ సైఫాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ రాజ్ దూత్ లేన్ దగ్గర ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
  • ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలు సెక్రటేరియట్ ఎక్స్ రోడ్డు వైపు డైవర్షన్ చేస్తారు.
  • నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు ట్రాఫిక్‌కు అనుమతి లేదు
  • నెక్లెస్ రోటరీ వద్ద సెక్రటేరియట్ జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు మళ్లింపు
  • నిరంకారి నుంచి ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు ట్రాఫిక్‌కు ఆంక్షలు
  • పోస్ట్ ఆఫీస్ వద్ద పాత పీఎస్ సైఫాబాద్ జంక్షన్ వైపు డైవర్షన్

ఈ మార్గాల్లో వెళ్లకండి!

ఖైరతాబాద్, షాదాన్ కాలేజ్, అయోధ్య,నిరంకారి, పాత పీఎస్ సైఫాబాద్, మింట్ కాంపౌండ్, ఎన్టీఆర్ మార్గ్, సెక్రటేరియట్ జంక్షన్, నెక్లెస్ రోటరీ, కేసీపీ జంక్షన్, మాసాబ్ ట్యాంక్ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్‌కు అవకాశం ఉంటుంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గలో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. 

 భక్తులకు ప్రత్యేక పార్కింగ్:

రేస్ కోర్స్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, ఐమ్యాక్స్ పక్కన హెచ్‌ఎండీఏ పార్కింగ్, ఐమ్యాక్స్ ఎదురుగా ఖాళీ స్థలం ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుంచి వచ్చే వారికి విశ్వేశ్వరయ్య భవన్‌లో
భక్తుల కోసం పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. 

వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కుంటే ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నెంబర్ 9010203626 కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.   

 ఘనంగా మహాగణపతి ఆగమన్ కార్యక్రమం: 

మరోవైపు ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన్ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి  భక్తులు భారీగా తరలివచ్చారు.   మేళతాళాలు, నృత్యాలతో గణనాథుడికి ఘన స్వాగతం పలికారు. గణేష్ ఉత్సవాలకు అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఏర్పాట్లు చేశారు. మహాగణపతి ఆగమన్‌తో భక్తుల్లో  ఆధ్యాత్మిక సందడి నెలకొంది. భక్తుల రద్దీ నేపథ్యంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. 

గణేష్ ఉత్సవాల నిర్వహణతో ఖైరతాబాద్‌లో పండుగ వాతావరణం నెలకొంది.  డీజే పాటలు, సంస్కృతిక కార్యక్రమాలతో గణనాథుడికి స్వాగతం పలుకుతున్నారు భక్తులు. మరి కాసేపట్లో గణనాథుడికి గంగా హారతి సమర్పించనున్నారు. గణేష్ మహారాజ్ కి జై అంటూ  ఖైరతాబాద్ దద్దరిల్లుతోంది. 

©️ VIL Media Pvt Ltd.