Reading Time: < 1 minute
Ap Railway Connectivity Gets Boost With %e2%82%b91157 Crore Project

AP Railway Connectivity: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక వసతులకు భారీ ఊతం లభించనుంది. రూ.1,157 కోట్ల వ్యయంతో రేణిగుంట–అరక్కోణం మధ్య 3, 4వ రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు రైలు ప్రయాణ సౌకర్యాలు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రైల్వే మౌలిక వసతుల విస్తరణతో ప్రయాణికుల రద్దీని సమర్థంగా నిర్వహించడంతో పాటు సరుకు రవాణాకు కూడా మరింత ఊతం లభించనుంది. ఈ రైల్వే ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైల్వే కనెక్టివిటీ విస్తరణతో వాణిజ్యం, రవాణా కార్యకలాపాలు వేగం పుంజుకునే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..