Reading Time: < 1 minute

సీఎం, డీజీపీ పేరు చెప్పి రూ.20 లక్షల మోసం.. KPHB పీఎస్లో వ్యక్తిపై కేసు నమోదు

Caption of Image.

సీఎం, డీజీపీ పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ లో 2026 సెప్టెంబర్ 10వ తేదీన కేసు నమోదైంది. తన ఇన్ ఫ్లూయెన్స్ ఉపయోగించి పనులు చేసి పెడతానని భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు  వ్యక్తి పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు.

పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. పి.ఆర్ నాయుడు అనే వ్యక్తి రాజకీయ పలుకుబడి ఉందని చెప్పి మోసాలకు పాల్పడుతున్నాడు. టీ స్టాల్ కు స్థలం ఇస్తానని చెప్పి ఒక వ్యక్తి దగ్గర 35వేలు వసూలు చేసినట్లు ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. తెలంగాణ డిజిపి పేరు సైతం వాడుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు బాధితులు ఫిర్యాడులో పేర్కొన్నారు. 

అంతకు ముందు మరో వ్యక్తిని మోసం చేసి 14 లక్షల రూపాయలు వసూలు చేశాడు పిఆర్ నాయుడు. ల్యాండ్ సెటిల్మెంట్ చేసి ఇస్తా అని ఒక పూజారి నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.  మరో వ్యక్తికి విద్యుత్ మీటర్ ఇప్పిస్తానని చెప్పి 7వేలు వసూలు చేసినట్లు చెప్పారు. 

ALSO READ ; అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్తో డీజీపీ కీలక భేటీ..

పీఆర్ నాయుడిపై ఇప్పటికే కేపి.హెచ్.బి పోలీస్ స్టేషన్ లో  5 కేసులు నమోదయ్యాయి. మళ్లీ ఫిర్యాదు అందటంతో పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. 

పీఆర్ నాయుడు పలుకుబడి ఉందని సామాన్యులను మోసం చేస్తూ దందాకు తెరతీసినట్లు పోలీసులు చెబుతున్నారు.  వీటి గురించి అడిగిన వారిపై  పిఆర్ నాయుడు తిరిగి కేసు పెట్టడంతో పాటు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు పోలీసుల ఎదుట వాపోయారు. 

©️ VIL Media Pvt Ltd.