గ్రహాలకు రాజు అయిన సూర్యుడు సెప్టెంబర్ 17న కన్యారాశిలోకి సంచారం చేయనున్నాడు. గత కొన్ని రోజుల నుంచి సింహ రాశిలో సంచరిస్తున్న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించడంతో ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఇది చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
కన్యా రాశి : కన్యారాశి వారికి ఇది అద్భుతమైన సమయం. వీరికి ఉన్న కష్టాలు అన్నీ తొలిగిపోతాయి. చాలా ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు తమ కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించుకునే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట వీరికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.
సింహ రాశి : సూర్యుడి సంచారం సింహ రాశి వారికి చాలా శుభ ఫలితాలను తీసుకొస్తుంది. అంతే కాకుండా ఈ రాశి వారికి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా, అన్ని విధాలుగా వీరికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి.ఈ రాశి వారు కొత్త లాభాలు పొందుతారు.
మకర రాశి : మకర రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అంతే కాకుండా దూర ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కళారంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆదాయం పెరగడంతో ఈ రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు. అన్ని విధాలుగా చాలా శుభ ప్రదంగా ఉంటుంది.
ధనస్సు రాశి : ధన్సు రాశి వారికి సూర్యుడు కన్యా రాశిలోకి సంచారం చేయడం వలన అదృష్టం కలిసి వస్తుంది. అంతే కాకుండా చాలా రోజుల నుంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అన్ని విధాలుగా వీరికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.




