Reading Time: < 1 minute

హీరో నుంచి గ్లామర్ X 125 బైక్ వచ్చేసింది.. ఈ బైక్ రేటు కూడా తక్కువనే.. హైలైట్స్ ఏంటంటే..

Caption of Image.

ప్రముఖ ఆటోమొబైల్స్ సంస్థ హీరో మోటోకార్ప్ గ్లామర్ కొత్త మోడల్ను మార్కెట్లోకి విడుదల చేసింది. హీరో మోటోకార్ప్, సింగిల్-ఛానల్ ఏబీఎస్, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (ఐబీఎస్)లను కలిపి రూపొందించిన కొత్త బ్రేకింగ్ సిస్టమ్‌తో గ్లామర్ ఎక్స్ 125ను విడుదల చేసింది. ఈ బైక్ ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.01 లక్షలు. 125cc సెగ్మెంట్‌లో సింగిల్-ఛానల్ ABS, IBSలతో వస్తున్న మొట్టమొదటి మోటార్‌ సైకిల్ గ్లామర్ X 125 అని హీరో హైలైట్ చేసింది.

ఈ కొత్త బ్రేకింగ్ హార్డ్‌వేర్ గట్టిగా బ్రేక్ వేసినప్పుడు ముందు చక్రాలు లాక్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. అదే సమయంలో IBS ముందు, వెనుక బ్రేకులను అనుసంధానించడం వల్ల బ్రేకింగ్ పనితీరును మెరుగుపరుస్తుంది. గ్లామర్ Xలో పానిక్ బ్రేక్ అలర్ట్, హజార్డ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

హీరో గ్లామర్ ఎక్స్‌లో 124.7cc, సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 8,250rpm దగ్గర 11.4bhp శక్తిని,6,500rpm దగ్గర 10.5Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్‌సైకిల్‌లో ఎకో, రోడ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అంతేకాకుండా, ఇందులో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. ఇది ఈ సెగ్మెంట్‌లోని మోటార్‌సైకిల్‌కు ఫస్ట్ టైం అమర్చడం విశేషం.

హీరో గ్లామర్ X 125లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, SMS అలర్ట్‌లతో కూడిన కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. ఇతర ఫీచర్లలో ఫుల్-LED లైటింగ్, ఒక USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, సీటు కింద రెండు మొబైల్ స్టోరేజ్ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ABSతో కూడిన గ్లామర్ X నాలుగు రంగులలో ఈ బైక్ అందుబాటులో ఉంది. గన్ మెటల్ గ్రే, మ్యాట్ యాక్సిస్ గ్రే, బ్లాక్ పెర్ల్ రెడ్, బ్లాక్ టీల్ బ్లూ కలర్స్లో అందుబాటులో ఉండటం గమనార్హం.

©️ VIL Media Pvt Ltd.