
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’. సెప్టెంబర్ 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోలు నిహాల్, సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ముందుగా ఈ సినిమాకు ‘చైనా పీస్’ అనే టైటిల్ పెట్టాం.
ఆ పేరుతో పాటలు, టీజర్ రిలీజ్ చేశాం. ప్రమోషన్స్ చేశాం. కానీ సెన్సార్ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. రివ్యూ కమిటీలు, ఈబీసీ చైర్మన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్.. ఇలా అందరూ టైటిల్‌పై అభ్యంతరం చెప్పారు. దీంతో కథకు తగ్గట్టుగా ఉండాలని ఆలోచించి ‘సీక్రెట్ సోల్జర్’ అని పెట్టాం.
సెన్సార్‌లోనే దాదాపు 8 నెలలు సినిమా ఉండిపోయింది. అయినా మా దర్శక నిర్మాత విశ్వనాథ్ రెడ్డి ఎక్కడా రాజీపడలేదు. ఇదొక స్పై డ్రామా. ఇందులో స్పై యాక్షన్ చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. ఇండియాకి సంబంధించిన ఓ కీలక ఇన్ఫర్మేషన్ లీక్ అవడంతో.. నెల్లూరులో చాలా సాదాసీదాగా బతికే ఇద్దరు కుర్రాళ్లు ఆ సమస్యను ఎలా పరిష్కరించారు అనేది కథ.
ఫస్ట్ హాఫ్‌లో ఫ్రెండ్‌షిప్ ఎమోషన్స్ చాలా బాగుంటాయి. మా ఇద్దరి క్యారెక్టర్స్ ఈ వరల్డ్‌లోకి ఎలా వచ్చాయి అనేది ఆసక్తికరంగా ఉంటుంది. స్నేహం, దేశభక్తి.. ఈ రెండు ఎమోషన్స్‌తో సినిమా ఉంటుంది. కమల్ కామరాజు, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్ సహా ప్రతి పాత్ర యూనిక్‌గా ఉంటుంది’ అని చెప్పారు.