
ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో విపరీతంగా వినిపిస్తున్న పేరు నందన. మొన్నటివరకు లండన్ లోనే నివాసమున్న ఆమెకు సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉంది. ‘నందూస్ వరల్డ్’ పేరుతో ఆమె చేసే వీడియోలు, పోస్టులకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆమె యూట్యూబ్ ఛానల్ కు సుమారు 28 లక్షల మంది సబ్ స్క్రైబర్ల ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు నందన క్రేజ్ ఎలాంటిదో. ఈ గుర్తింపు తోనే ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ మన శంకరవరప్రసాద్ గారు సినిమాలోనూ ఓ క్యామియో రోల్ లో కనిపించింది. అయితే గత కొన్ని రోజులుగా నందనపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల ఆశ చూపించి, తన భర్త తో కలిసి నందన లక్షల రూపాయలు దొచ్చుకుందని రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ఈ యూట్యూబర్ పై కేసులు పెట్టారు. ఈ వ్యవహారంలో ఆమెపై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అయితే ఇది తెలిసి కూడా ఆమె ఇండియాకు రావడం, ఆ వెంటనే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులకు చిక్కడం చకా చకా జరిగిపోయాయి. అయితే బిగ్ బాస్ 10లో అవకాశం రావడంతోనే నందన హైదరాబాద్ కు వచ్చిందని ఈ క్రమంలోనే పోలీసులకు చిక్కిందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నందన కేసు కోర్టులో నడుస్తోంది.
ఇలా వరుస వివాదాలు, కోర్టు కేసులతో వార్తల్లో నిలుస్తోన్న నందన బిగ్ బాస్ ఎంట్రీ ఖాయమైపోయిందని, వైల్డ్ కార్డ్ ద్వారా ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇందుకోసం బిగ్ బాస్ టీమ్ నందనకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ఆఫర్ చేసందని వార్తలు వస్తున్నాయి. వారానికి సుమారు రూ. 2 లక్షల చొప్పున నందనకు పారితోషికంగా ఇచ్చేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు రెడీగా ఉన్నారని సమాచారం. మరోవైపు నందనకు బిగ్ బాస్ ఆఫర్ రావడంపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయమై కాంగ్రెస్ నాయకులు బిగ్ బాస్ నిర్వాహకులకు, హోస్ట్ నాగార్జున తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నందనను బిగ్ బాస్ లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకోబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరి ఇన్ని వివాదాల మధ్య నందన నిజంగానే బిగ్ బాస్ 10లోకి అడుగు పెడుతుందా? లేదా? అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
భర్త, పిల్లలతో యూట్యూబర్ నందన..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.