Reading Time: < 1 minute

జగిత్యాల పబ్లిక్.. చైతన్య డైరీ పాలు కొంటున్నారా..? జర భద్రం… బీ కేర్ ఫుల్..!

Caption of Image.

జగిత్యాల జిల్లాలో కల్తీ పాల కలకలం రేగింది. స్థానిక వాణి నగర్ లోని చైతన్య డైరీ పాల కేంద్రంలో కల్తీ బాగోతం బయటపడింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల పట్టణానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి శనివారం ( సెప్టెంబర్ 12 ) ఉదయం పాల కోసం చైతన్య డైరీ పార్లర్ కి వెళ్లి పాల ప్యాకెట్ కొన్నాడు. ఇంటికి వెళ్లి పాల ప్యాకెట్ ఓపెన్ చేసి చూడగా షాక్ అయ్యాడు లక్ష్మణ్.

ఇంటికి వెళ్లి పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్ లో పెట్టాడు లక్ష్మణ్. కొద్దిసేపటి తర్వాత పాల ప్యాకెట్ ఓపెన్ చేసి చూడగా పాలు గమ్ రూపంలో మారిపోవడంతో షాక్ అయ్యాడు లక్ష్మణ్. వెంటనే పాలు కొన్న కేంద్రానికి వచ్చి నిర్వాహకుడిని నిలదీశాడు.

బాధితుడి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినా నిర్వాహకుడు మరొక ప్యాకెట్ ఇస్తానని.. సైలెంట్ గా ఉండాలని కోరాడు. అందుకు అంగీకరించని బాధితుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యాడు.

కల్తీ పాలతో చిన్నారులు, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్తీ పాల వ్యాపారులపై, సదరు డెయిరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.