
యాపిల్ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్ప్రైజ్ అండ్ షైన్ ఈవెంట్‌లో iPhone 18 Pro Max సిరీస్ తో పాటు సరికొత్త ఆపిల్ ఐఫోన్ డ్యూయోను అధికారికంగా విడుదల చేసింది. అయితే ఈ ఐఫోన్ భారీ ధరల పెంపు ప్రస్తుతం టెక్ యూట్యూబర్స్,సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసింది. అమెరికాలో ఈ ఫోన్ ప్రారంభ ధర 1999 డాలర్లు ఉండగా మన దేశంలో దీని ధరలు మునుపెన్నడూ లేని స్థాయికి చేరాయి. ఈ ధరలపై టెక్ యూట్యూబర్స్ ,కంటెంట్ క్రియేటర్లు ఈ ధరలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ట్యాక్సులు అన్ని కలిపిన తర్వాత కూడా ఈ ధర అమెరికా ధర కంటే చాలా ఎక్కువగా కనిపిస్తోందన్నారు. ఇది కస్టమర్లను గ్రే-మార్కెట్ వైపు మళ్లించే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఆపిల్ తన మొదటి ఫోల్డబుల్ ఐఫోన్ అయిన ఐఫోన్ డ్యూయోను, సెప్టెంబర్ 9న ఐఫోన్ 18 ప్రో ,ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లతో పాటు విడుదల చేసింది. భారత్ లో ఈ డివైజ్ బేస్ 256GB వేరియంట్ ధర రూ. 2లక్షల 99వేల 900 నుంచి ప్రారంభమవుతుంది. 512GB వేరియంట్ ధర రూ. 3లక్షల 24వేల900, 1TB వేరియంట్ ధర రూ. 3లక్షల 74వేల900 , టాప్-ఎండ్ 2TB మోడల్ ధర రూ. 4లక్షల49వేల900గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా, అమెరికాలో ఈ ఫోన్ ధర సుమారు 1999 డాలర్ల ప్రారంభ ధరతో విడుదల చేశారు.
యూట్యూబర్ల అసంతృప్తి..
టెక్ యూట్యూబర్స్ ,కంటెంట్ క్రియేటర్లు ఈ ధరలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. యాపిల్ కేవలం చిన్నపాటి మార్పులు చేసి, మెమరీ కాస్ట్‌లు పెరిగాయనే సాకుతో ఇంత భారీగా రేట్లు పెంచడం హాస్యాస్పదం, దారుణం అంటూ తమ రివ్యూ వీడియోలలో మండిపడుతున్నారు.
టెక్ యూట్యూబర్ గీకీరంజిత్, భారత్ లో ఆపిల్ ఐఫోన్ డ్యూయో ధరను విమర్శిస్తూ దాని ప్రారంభ ధర రూ. 2లక్షల99వేల900 చాలా దారుణం అని అన్నారు.ట్యాక్సులు అన్ని కలిపిన తర్వాత కూడా ఈ ధర అమెరికా ధర కంటే చాలా ఎక్కువగా కనిపిస్తోందన్నారు.
తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో, ట్యాక్సులను కూడా లెక్కలోకి తీసుకున్నా భారత్ లో ధర సరిపోవడం లేదని కుమార్ వాదించారు. దాదాపు 2వేల అమెరికా డాలర్ల ప్రారంభ ధరను మార్చి, దానిపై 18 శాతం జీఎస్‌టీని జోడిస్తే, డ్యూయో ధర సుమారు రూ. 2లక్షల35వేలనుంచి రూ. 2లక్షల40వేల మధ్య ఉండాలి. ఇది ఆపిల్ వాస్తవంగా వసూలు చేసిన దాదాపు రూ. 3 లక్షల ధర కంటే చాలా తక్కువ, ఇది హాస్యాస్పదంగా ఉందన్నారు. దీని వెనుక ఆపిల్ వాదన తనకు అర్థం కాలేదని చెప్పారు. ఇది కస్టమర్లను గ్రే-మార్కెట్ వైపు మళ్లించే అవకాశం ఉందని హెచ్చరించారు.
పాత మోడల్స్ ధరలు కూడా పెంపు..
సాధారణంగా కొత్త ఐఫోన్ వచ్చినప్పుడు పాత మోడల్స్ ధరలు తగ్గుతాయి. కానీ ఈసారి యాపిల్ సంస్థ పాత iPhone 17 ధరను కూడా సుమారు భారత్ లో కూడా 100 డాలర్లు పెంచడంపై యూట్యూబర్స్ యాపిల్ వ్యూహాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
బేస్ మోడల్ iPhone 18 విడుదల ఆలస్యం..
సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండే బేస్ మోడల్ iPhone 18ను ఈ ముందుగా విడుదల చేయకుండా, మార్చి 2027కి వాయిదా వేశారు యాపిల్. కస్టమర్లు తప్పనిసరిగా ఎక్కువ ధర గల ప్రొ మోడల్స్ కొనేలా యాపిల్ ట్రాప్ చేసిందని యూట్యూబర్లు ఆరోపిస్తున్నారు.
ఫీచర్ల పరంగా కొత్త 2nm A20 ప్రొ చిప్, వేరియబుల్ అపెర్చర్ కెమెరా వంటి అప్‌గ్రేడ్స్ ఉన్నప్పటికీ, ఈ ఐఫోన్ 18 ప్రొ మాక్స్ సాధారణ ప్రజల బడ్జెట్‌కు చాలా దూరమైపోయిందని టెక్ ప్రపంచంలో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది.