
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇండియా టూర్ ఖరారైంది.బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు జిన్ పింగ్ ఇండియాకు రానున్నారని చైనా ధృవీకరించింది. సెప్టెంబర్ 12నుంచి రెండు రోజుల పాటు బ్రిక్స్ సమ్మిట్ ఢిల్లీలోని భారత్ మండపలంలో గ్రాండ్ గా జరగనున్నాయి. ఈ సదస్సుకు బ్రిక్స్ శాశ్వత సభ్యుత్వ దేశాలతో పాటు సభ్య దేశాల ప్రముఖులు పాల్గొననున్నారు.
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగి ఈ బ్రిక్స్ సమావేశాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియాన్‌లతో పాటు ఇతర సభ్య దేశాల అధినేతలు హాజరవుతున్నారు. పునస్థాపన, ఆవిష్కరణ, సహకారం,సుస్థిరత కోసం నిర్మాణం థీమ్ తో నిర్వహిస్తున్నారు. ఇది ప్రధాని మోదీ హ్యుమానిటీ ఫస్ట్ విధానాన్ని ప్రతిబింబిస్తుంది.
ALSO READ : టెలికాం రంగంలో కొత్త విధానం..
ఈ ఏడాది జనవరి 1 న బ్రెజిల్ నుంచి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది. ఈ సమ్మిట్ కు భారత్ నాలుగోసారి ఆతిథ్యమిస్తోంది. గతంలో 2012, 2016, 2021లో కూడా భారత్ బ్రిక్స్ సమావేశాలకు అధ్యక్షత వహించింది.