Reading Time: < 1 minute
Stories Revolving Around The Father Daughter Bond Are Currently Trending In Tollywood

టాలీవుడ్‌లో ఫాదర్-డాటర్ సెంటిమెంట్ స్టోరీస్ ట్రెండ్ నడుస్తోంది. తండ్రి – కూతుళ్ల రిలేషన్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూపిండచం కొత్తేమీ కాదు బ్లాక్ వైట్ కాలం నుండి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు ఈ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. గత కొంతకాలంగా ఈ ట్రెండ్ కాస్త తగ్గింది కానీ మళ్ళి అదే సెంటిమెంట్ ఇప్ప్పుడు సక్సెస్ ఫార్ములా మారింది. తాజాగా ఇరుముడితో మరోసారి ఫ్రూవ్ అయ్యింది. త్రినాధ్- మణమ్మ రిలేషన్‌ను ఓన్ చేసేకున్నారు ఆడియన్స్. రవితేజ అండ్ బేబి నక్షత్ర నటనకు ఫిదా అయ్యి.. కాసులు కురిపిస్తున్నారు. ఇప్పటికే 200 కోట్లు క్రాస్ చేసి ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది ఇరుముడి.

ఇరుముడి మాత్రమే కాదు.. గతంలో తండ్రి- కూతుళ్ల బాండింగ్‌తో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ నమోదు చేశాయి. హాయ్ నాన్నలో మహి కోసం భార్యనే వదిలేసే తండ్రి పాత్రలో నాని ఒదిగిపోయాడు. 2023లో వచ్చిన ఈ మూవీ డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఇక అదే ఏడాదొచ్చిన భగవంత్ కేసరిలో పెంచుకున్న కూతురు కోసం, ఆమె లక్ష్యాలను చేధించడం కోసం కష్టపడే ఫాదర్‌గా బాలయ్య వావ్ అనిపించారు. రవితేజ విక్రమార్కుడు కూడా డాటర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్‌తో వచ్చిన సినిమానే. వెంకటేష్ దృశ్యం కూడా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చుట్టూనే తిరుగుతోంది. కూతురు వల్ల జరిగిన ఓ తప్పును కప్పిపుచ్చే తండ్రిగా అతడు పడే తపన ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేసింది. కానీ సైంథవ్ స్టోరీ మాత్రం మిస్ ఫైర్ అయ్యింది. నెక్ట్స్ చిరంజీవి కాకా కూడా డాటర్ అండ్ ఫాదర్ బాండింగ్ చూపించబోతున్నారు. గతంలో తండ్రి-కూతురు సెంటిమెంట్‌తో వచ్చిన డాడీ ఫిల్మ్ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. మరి కాకా ఈ సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందేమో చూడాలి.