Reading Time: 2 minutes

ఢిల్లీలో ‘BRICS Summit 2026’ అలర్ట్ : సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ఏవి ఓపెన్? ఏవి బంద్ అంటే ?

Caption of Image.

భారత రాజధాని ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్ మండపంలో 18వ ‘బ్రిక్స్’ (BRICS) లీడర్స్ సమ్మిట్ సమావేశం జరగనుంది. ప్రపంచ దేశాధినేతలు, విదేశీ ప్రతినిధులు భారీగా తరలివస్తుండటంతో ఢిల్లీ ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. దింతో సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ఢిల్లీ నగరం వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ రోజుల్లో ఢిల్లీలో సాధారణ సేవలు, కార్యాలయాల నిర్వహణపై విధించిన నిబంధనల ప్రకారం : 

ఏవి మూసివుంటాయంటే :
*ఢిల్లీ విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూలన్నిటికి సెప్టెంబర్ 11 (శుక్రవారం) రోజున సెలవు ప్రకటించారు.
* ఎన్‌సిటి ఆఫ్ ఢిల్లీ (NCT) పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆఫీసులు, పిఎస్‌యులు, స్వయంప్రతిపత్తి సంస్థలకు సెప్టెంబర్ 11న లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వ సెలవుగా ప్రకటించారు.
*సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్‌లోని మెట్రో మ్యూజియం సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు తాత్కాలికంగా మూసివేయబడుతుంది.

ఏవి తెరిచి ఉంటాయంటే: 
* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్యాలెండర్‌లో సెలవు లేనందున సెప్టెంబర్ 11న ఢిల్లీలో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.
*ప్రైవేట్ సంస్థలు సాధారణంగానే నడుస్తాయి. అయితే ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా ఉద్యోగులు ముందుగా బయలుదేరడం మంచిది.
*ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్ అంతటా మెట్రో  రైళ్లు ఎప్పటిలాగే మామూలుగానే నడుస్తాయి.
*ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సర్వీసులు  ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయి. అయితే VVIPలు తిరిగే ప్రాంతాల్లో పిక్‌అప్, డ్రాప్ పాయింట్లపై కొన్ని పరిమితులు ఉంటాయి.

ట్రాఫిక్‌  ఆంక్షలు & ప్రయాణికులకు సూచనలు:

*VVIP మోటార్‌కేడ్స్ వెళ్లే సమయంలో దాదాపు 22 ప్రధాన కేంద్రాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తారు.
*మధుర రోడ్, సర్దార్ పటేల్ మార్గ్, శాంతి పాత్, జన్‌పథ్, అశోక రోడ్, బారాఖంబా రోడ్, టాల్‌స్టాయ్ మార్గ్ సహా 35కు పైగా ప్రధాన రహదారులపై రాకపోకలపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
*ఆర్టీసీ బస్సులను కూడా కొన్ని మార్గాల్లో తాత్కాలికంగా దారి మళ్లిస్తారు.

ఈ ప్రాంతాల్లో ప్రయాణించే వారు ట్రాఫిక్ పోలీస్ అప్‌డేట్స్‌ను గమనిస్తూ, వారి  ప్రయాణానికి అదనపు సమయాన్ని కేటాయించుకోవాలని అధికారులు సూచించారు.
 

©️ VIL Media Pvt Ltd.