
హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళా అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. మృతురాలిని ఓ కార్ల షోరూమ్‌లో ఉద్యోగం చేసే హేమగా గుర్తించారు పోలీసులు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.