
శ్రావణ మాసం రేపటితో(2026 సెప్టెంబర్11)తో ముగియనుంది. ఈ ఏడాది ( 2026) పోలాల అమావాస్య.. చివరి శ్రావణ శుక్రవారం రెండూ ఒకే రోజు వచ్చాయి. ఇలా రావడం చాలా అరుదని పండితులు చెబుతున్నారు. అయితే జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాలు ఆ రోజు చేసిన పూజకు.. దానాలకు విశేషమైన ఫలితం ఉంటుంది. ప్రతి రాశి వారు వారి పుట్టిన నక్షత్రం ఆధారంగా.. వారి రాశి ప్రకారం కొన్ని పరిహారాలు చేయాలని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
మేష రాశి
- శివాలయదర్శనం..
- పరమేశ్వరుడికి ఎర్రని పూలు సమర్పణ
- పేదలకు గోధుమలు.. ఎర్రని వస్త్రాలు దానం
వృషభ రాశి:
- శివలింగానికి పాలతో అభిషేకం
- తెల్లని రంగు పూలతో పూజ
- మహాలక్ష్మి ఆరాధన
- పేదలకు పటిక బెల్లం.. పాలు దానం
- బ్రాహ్మణులకు తెల్లని వస్త్రాలు..దక్షిణ
మిథున రాశి
- గోమాతకు పచ్చగడ్డి ఆహారం
- పరమేశ్వరునికి బిల్వపత్రాలతో పూజ
- ఓం నమః శివాయ జపం
- పేదలకు ఆర్థికసాయం, అన్నదానం
కర్కాటక రాశి
- పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం
- పేదలకు అన్నదానం
- దేవాలయంలో పాలు, బియ్యం సమర్పించడం
- బ్రాహ్మణులకు స్వయంపాకం
సింహ రాశి
- శివలింగానికి తేనెతో, నీళ్లతో అభిషేకం
- సూర్య నమస్కారాలు చేయడం
- ఎరుపు రంగు వస్తువులు
కన్యా రాశి
- వినాయకుడికి గరికతో పూజ
- శివుడిని ఆరాధించాలి
- అనాథలకు సాయం
- విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం
- పేదలకు ఆకుపచ్చని వస్తువులు దానం
తులా రాశి
- శివాలయంలో ఆవు నెయ్యితో దీపారాధన
- బ్రాహ్మణులకు తెల్లని వస్త్రాలు దానం
- పేదలకు అన్నదానం
వృశ్చిక రాశి
- శివలింగానికి జలాభిషేకం చేసి బిల్వపత్రాలను సమర్పించాలి.
- హనుమాన్ చాలీసా పఠించడం
- పేదలకు నల్ల నువ్వులు దానం
- గోమాతకు గోధుమలు, తోటకూర ఆహారం
ధనస్సు రాశి
- శివునికి పసుపు రంగు పువ్వులు, చందనం సమర్పించాలి.
- బ్రాహ్మణులకు లేదా గురువులకు పసుపు రంగు వస్త్రాలు,
- శనగలు దానం చేయడం
- పేదలకు ఆర్థిక సాయం
మకర రాశి
- శివాలయంలో నువ్వుల నూనెతో దీపం
- నల్లటి వస్త్రాలు లేదా ఇనుప వస్తువులు దానం
- పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం
కుంభ రాశి
- శివ సహస్రనామ పఠనం
- మహామృత్యుంజయ మంత్రం జపించడం
- ఆవనూనె దానం
మీన రాశి
- శివలింగానికి పసుపు , కుంకుమతో పూజ
- పేదలకు అన్నదానం
- పసుపు రంగు పండ్లు దానం
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.