
Lucky Born Numerology: సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని న్యూమరాలజీ నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఏ నెలలోనైనా 3, 12, 21 లేదా 30వ తేదీన జన్మించిన వారి మూలాంకం 3గా పరిగణిస్తారు. సంఖ్యాశాస్త్ర విశ్వాసాల ప్రకారం ఈ సంఖ్యకు దేవగురు బృహస్పతితో సంబంధం ఉంటుంది. అందువల్ల ఈ తేదీల్లో జన్మించిన పిల్లలు జ్ఞానం, తెలివితేటలు, సృజనాత్మకత వంటి లక్షణాలను కలిగి ఉంటారని నమ్మకం.
మూలాంకం 3 పిల్లలను కొందరు సంఖ్యాశాస్త్రంలో అదృష్టవంతులుగా భావిస్తారు. వీరు జన్మించిన తర్వాత కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని, ఇంట్లో సంతోషం, సౌభాగ్యం పెరుగుతుందని విశ్వాసం. ఈ మూలాంకం కలిగిన పిల్లలు చదువుపై ఆసక్తి చూపుతారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. కొత్త విషయాలను త్వరగా నేర్చుకునే సామర్థ్యం, మంచి జ్ఞాపకశక్తి, విషయాలను అర్థం చేసుకునే తెలివితేటలు వీరిలో ఉంటాయని నమ్ముతారు. చిన్న వయసులోనే తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉంటుందని చెబుతారు.
నిండుగా సృజన్మాత్మక ఆలోచనలు
మూలాంకం 3 పిల్లల్లో సృజనాత్మక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. పెయింటింగ్, రచన, వాదనలు, ప్రసంగాలు వంటి రంగాల్లో వీరు రాణించవచ్చని న్యూమరాలజీ అభిప్రాయం. అంతేకాకుండా ఎదుటివారితో సులభంగా కలిసిపోయే స్వభావం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయని భావిస్తారు.
పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటారు
సంఖ్యాశాస్త్ర విశ్వాసాల ప్రకారం వీరు చిన్న వయసు నుంచే పెద్ద కలలు కంటారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడే స్వభావం కలిగి ఉంటారని చెబుతారు. అలాగే పెద్దలను గౌరవించడం, సామాజికంగా చురుకుగా ఉండటం, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపడం వంటి లక్షణాలు కూడా ఉంటాయని నమ్మకం.
(గమనిక: పై వివరాలు న్యూమరాలజీ విశ్వాసాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. పిల్లల వ్యక్తిత్వం, ప్రతిభ, భవిష్యత్తును పుట్టిన తేదీ ఒక్కటే నిర్ణయించదు.)