Reading Time: < 1 minute

ట్రోఫీ గెలిచారు.. ఆ వెంటనే డాన్స్‌తో దుమ్మురేపారు: ఇషాన్-వైభవ్ సెలబ్రేషన్ వైరల్!

Caption of Image.

Ishan Kishan And Vaibhav Dance: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో సౌత్ జోన్‌ను చిత్తు చేసి, ఏకంగా 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన ఈస్ట్ జోన్ ఆటగాళ్లు మైదానంలోనే కాకుండా బయట కూడా రచ్చ రంబోలా చేస్తున్నారు. చారిత్రాత్మక విజయం సాధించిన వెంటనే కెప్టెన్ ఇషాన్ కిషన్, యంగ్ బ్యాటింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కలిసి వేసిన ఊరమాస్ డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను తెగ వైరల్ అవుతున్నాయి. 

నెట్టింట వైరల్ అవుతున్న మాస్ డ్యాన్స్: 

ఐదు రోజుల పోరాటం తర్వాత ఛాంపియన్‌గా నిలవడంతో ఈస్ట్ జోన్ క్యాంప్‌లో పండగ వాతావరణం నెలకొంది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి హోటల్ వరకు ప్లేయర్స్ సంబరాలు ఆంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ ఒకరికొకరు పోటీ పడుతూ వేసిన స్టెప్పులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కెప్టెన్‌గా జట్టుకు ట్రోఫీ అందించడమే కాకుండా, ఫైనల్లో (270 పరుగులు) ఇన్నింగ్స్ ఆడిన జోష్‌లో ఇషాన్ పూర్తి ఎనర్జీతో స్టెప్పులేశాడు. వైభవ్ కూడా కెప్టెన్‌కు ఏమాత్రం తగ్గకుండా డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. రోజంతా మైదానంలో పడ్డ కష్టాన్ని మర్చిపోయి, సీనియర్-జూనియర్ అనే తేడా లేకుండా జట్టు సభ్యులంతా కలిసి ఈ విజయాన్ని ఆస్వాదించారు.

13 ఏళ్ల కల నెరవేరిన వేళ: 

ఈస్ట్ జోన్ డొమెస్టిక్ క్రికెట్‌కు ఈ విజయం అత్యంత కీలకమైనది. గత 13 ఏళ్లుగా దక్కని దులీప్ ట్రోఫీని మళ్లీ ముద్దాడటంతో ఆటగాళ్ల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇషాన్ కిషన్ నాయకత్వంలో జట్టు చూపించిన క్రమశిక్షణ, యంగ్ ప్లేయర్ల అద్భుత ప్రదర్శనతో ఈస్ట్ జోన్ చరిత్ర సృష్టించింది. మైదానంలో చూపిన కసి, విజయం తర్వాత కనబరిచిన ఈ సరదా వాతావరణం ఈస్ట్ జోన్ జట్టులోని ఐక్యతకు అద్దం పడుతోంది. 

 

 

©️ VIL Media Pvt Ltd.