Reading Time: < 1 minute
Sardar 2 Promising Idea Poor Execution Another Disappointing Sequel

తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ సూపర్ అవడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా సర్దార్ 2 ను తీసుకువచ్చారు. భారీ అంచనాల మధ్య థియేటర్స్ లోకి వచ్చిన ‘సర్దార్ 2’ ఓవర్సీస్ టాక్ ఎలా ఉందంటే.. అసలు సినిమాకు అనవసరమైన ఎలాంటి కథ, కథనాలు లేకుండా సినిమా మొదటి నుండి ముగింపు వరకు ‘మిషన్’ పైనే దృష్టి పెట్టినప్పటికీ తెరపై దాన్ని చూపించిన తీరు మాత్రం దారుణంగా నిరాశపరుస్తుంది. లాజిక్ కి దూరంగా ఉండే సీన్లు, మోతాదుకు మించిన యాక్షన్ ఈ సినిమా గ్రాఫ్‌ను దెబ్బతీశాయి.

సినిమాలో విపరీతమైన, నమ్మశక్యం కానీ యాక్షన్ దృశ్యాలు సీరియస్ సన్నివేశాల తీవ్రతను తగ్గించేశాయి. దీనివల్ల సినిమాలో వచ్చే కీలక ఘట్టాలు కూడా ప్రేక్షకులకు కామెడీగా, సిల్లీగా అనిపిస్తాయి. కార్తి పోషించిన సీనియర్ ‘సర్దార్’ పాత్ర ఆధారంగా వచ్చే ముఖ్యమైన బ్లాక్స్‌తో సహా, ఏ ఒక్క సీన్ కూడా అనుకున్న స్థాయిలో పండలేదు. ఇక ప్రతినాయకుడిగా నటించిన పి.ఏ.వి. ఎస్.జె. సూర్య తన నటనతో ఇంపాక్ట్ చూపించడం కంటే ఎక్కువ అరుపులు, గోలతో ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించారు. పాటలు, అనవసరమైన కమర్షియల్ వినోదాలు లేదా ఇతర దృష్టి మళ్లించే విషయాలు ఏవీ లేకుండా కథను నేరుగా చెప్పడానికి ప్రయత్నించడం మంచి విషయమే. అయినప్పటికీ ప్రేక్షకులకు ఇవ్వాల్సిన అసలైన థ్రిల్ మరియు ఇంపాక్ట్‌ను అందించడంలో దర్శకుడు తప్పటడుగులు వేసాడు.  ఫస్టాఫ్ లో పండని డ్రామాను భరిస్తూ సాగిన ప్రేక్షకుడికి సెకండ్ హాఫ్ అయినా బలమైన కథనం, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు వస్తాయని ఆశించడం సహజం. కానీ ఆ కీలకమైన సెకండ్ హాఫ్ తేలిపోవడంతో ఈ ‘మిషన్’ అసలు గాల్లోకి ఎగరకముందే నేలకూలింది.