
SUVలో ప్రయాణంతో పాటు క్యాంపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, లగ్జరీ అనుభూతిని కోరుకునే వారికి Xiaomi SkyNomad ఆసక్తికరమైన ఆప్షన్‌గా మారనుంది. Xiaomi తాజాగా పరిచయం చేసిన ఈ SUV సిరీస్‌లో 5-సీటర్, 7-సీటర్ వేరియంట్లతో పాటు క్యాంపింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన Studio మోడల్ కూడా ఉంది. భారీ బ్యాటరీలు, స్మార్ట్ టెక్నాలజీ దీనికి అదనపు ఆకర్షణ.
నాలుగు వేరియంట్లు..
Xiaomi SkyNomad సిరీస్‌ను Kunlun ప్లాట్‌ఫారమ్, అధునాతన టెక్నికల్ ఆర్కిటెక్చర్ ఆధారంగా అభివృద్ధి చేసినట్టు కంపెనీ తెలిపింది. ఈ సిరీస్‌లో N70 Pro, N70 Max 5-సీటర్ మోడళ్లుగా రాగా, N90 Max 7-సీటర్ ఆప్షన్‌గా అందుబాటులోకి వచ్చింది. క్యాంపింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని N90 Max Studioను ప్రత్యేకంగా రూపొందించారు.
డిజైన్ పరంగా N70 మోడల్ 4,960 మి.మీ. పొడవు, 1,998 మి.మీ. వెడల్పు, 2,950 మి.మీ. వీల్‌బేస్‌తో ఉంటుంది. బాక్సీ డిజైన్‌కు Dragonfly హెడ్‌ల్యాంప్స్, Inverted-U టెయిల్ ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. క్యాబిన్‌లో Cabinet-Style సెంటర్ కన్సోల్, 33 స్టోరేజ్ కంపార్ట్‌మెంట్లు, 256-కలర్ యాంబియంట్ లైటింగ్, Zero-Gravity సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. 9 లీటర్ల రిఫ్రిజిరేటర్, 21.4 అంగుళాల రియర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ కూడా అందించారు.
1,400 కిలోమీటర్లకు పైగా కంబైన్డ్ రేంజ్
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే Xiaomi SkyNomadలో మోడల్‌ను బట్టి విభిన్న బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. N70 Proలో 52kWh బ్యాటరీ ఉండగా, ఇది 351 కి.మీ. EV రేంజ్, 1,351 కి.మీ. కంబైన్డ్ రేంజ్ అందిస్తుంది. N70 Max, N90 Max మోడళ్లలో 76kWh టెర్నరీ లిథియం బ్యాటరీలను ఉపయోగించారు. ఇవి 1,400 కిలోమీటర్లకు పైగా కంబైన్డ్ రేంజ్ అందిస్తాయని కంపెనీ పేర్కొంటోంది.
N90 Max Studio మాత్రం క్యాంపింగ్ కోసం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఇందులో Electric Lifting Cabin Roof, Rooftop Bed, 30 అంగుళాల ప్రొజెక్షన్ సిస్టమ్, Floor Heating వంటి ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. భద్రత కోసం మోడల్‌ను బట్టి 9 నుంచి 12 ఎయిర్‌బ్యాగ్‌లు, 25 స్టాండర్డ్ సేఫ్టీ అసిస్టెన్స్ ఫీచర్లు, LiDAR, NVIDIA Thor-U చిప్ ఆధారిత డ్రైవింగ్ అసిస్టెన్స్‌ను అందించారు.
చైనా మార్కెట్లో Xiaomi N70 Pro ధర 2,09,900 యువాన్ (సుమారు రూ.29.5 లక్షలు), N70 Max ధర 2,39,900 యువాన్ (సుమారు రూ.33.8 లక్షలు), N90 Max ధర 2,69,900 యువాన్ (సుమారు రూ.38 లక్షలు), N90 Max Studio ధర 2,99,900 యువాన్ (సుమారు రూ.42.2 లక్షలు)గా ఉంది. భారత మార్కెట్లో లాంచ్‌పై Xiaomi నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.