Reading Time: < 1 minute
Silent War Between Suriya And Sivakarthikeyan

సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ వార్ నడుస్తుంది. కోలీవుడ్‌లో కాంట్రవర్సీ లేని హీరోల్లో ఫస్ట్ వరుసలో ఉంటాడు సూర్య. అలాంటి హీరోను మరో తమిళ హీరో శివకార్తీకేయన్ టార్గెట్ చేశాడంటున్నారు ఫ్యాన్స్. శివకార్తీకేయన్ వేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సూర్య అభిమానుల్ని గట్టిగా హర్ట్ చేస్తోంది. సూర్యను శివ టార్గెట్ చేయడం వెనుక నాలుగేళ్ల క్రితం ప్లాష్ బ్యాక్ స్టోరీ ఉంది. కోలీవుడ్‌లో రీసెంట్‌గా కార్తీ సర్దార్2, సూరి మండాడి చిత్రాలు రిలీజయ్యాయి. సర్దార్2 టీంకి, కార్తీకి విషెస్ చెబుతూ శివకార్తీకేయన్ ట్వీట్ చేశాడు. అక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత మండాడినుద్దేశించి అన్ని చోట్ల నుండి మంచి రెస్సాన్స్ వస్తోందని, సూరి కష్టాన్ని పొగిడాడు శివ. అలాగే గుడ్ కంటెంట్ ఆల్వేజ్ విన్స్ బిగ్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్‌ని సూర్యకు కౌంటర్ అని ఫీలవుతున్నారు సూర్య ఫ్యాన్స్.

సూర్యపై పనిగట్టుకుని శివకార్తీకేయన్ ఈ రివెంజ్ ప్లాన్ చేయలేదు. గతంలో సూర్య చేసిన ఓ ట్వీట్ ఈ రచ్చకు కారణమైంది. 2022లో కార్తీ సర్దార్ అండ్ ప్రిన్స్ ఒకే రోజు రిలీజయ్యాయి. ప్రిన్స్ టీంకి విషెస్ చెబుతూనే సర్దార్ టీంకి గుడ్ కంటెంట్ ఆల్వేజ్ విన్స్ అంటూ విషెస్  తెలుపుతూ ట్వీట్ చేశాడు. ప్రిన్స్ ప్లాప్ కావడం సర్దార్ హిట్ కావడంతో సైలెంట్ గా ఉన్న శివకార్తికేయన్ ఇప్పడు నాలుగేళ్ల తర్వాత సర్దార్ 2 ప్లాప్ టాక్ తెచ్చుకున్న టైమ్ లో ట్వీట్ తో రివెంజ్ తీర్చుకున్నాడు.  దీంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ట్రోల్స్ మొదలు పెట్టారు. సూర్య అండ్ శివకార్తీకేయన్ మధ్య ఈ సైలెంట్ వార్ ఇక్కడితో ఆగుతుందో…? కంటిన్యూ అవుతుందో చూడాలి.