
బీఆర్ఎస్ నేతలపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. మహిళా పోలీసులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో గురువారం ( సెప్టెంబర్ 10 ) కేసు నమోదు చేశారు సైఫాబాద్ పోలీసులు. ఈ కేసులో నిందితులుగా హరీష్ రావు, కేటీఆర్, సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డిలను చేర్చారు పోలీసులు.
మహిళా పోలీసులను అవమానించారన్న ఫిర్యాదు మేరకు BNS 74, 75(1)(3), 79, BNS 121(1), 190, 132, BNS 296, 351(2), 352, BNS 3(5) సెంక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.
దాడి, బెదిరింపులు, అసభ్య ప్రవర్తన ఆరోపణల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.విధులకు ఆటంకం కలిగించారని… మహిళా పోలీసులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు.
►ALSO READ | సూర్యాపేట జిల్లా పాలకవీడు తహశీల్దార్ ఆఫీసుకు తాళం.. రెండేళ్లుగా అద్దె చెల్లించలేదని..
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నానా హంగామా సృష్టించారు. బ్లాక్ టీ షర్ట్స్ తో వచ్చిన నేతలను అసెంబ్లీలోకి అనుమతించకపోవడంతో పోలీసులపై రెచ్చిపోయారు బీఆర్ఎస్ నేతలు. పోలీసులను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.