Reading Time: < 1 minute

లాస్ట్ ఓవర్లో డ్రామా: పాక్‌ను దెబ్బకొట్టి ఫైనల్లో భారత్తో శ్రీలంక ఢీ.. 

Caption of Image.

 మహిళా ఆసియా కప్ 2026లో పాకిస్థాన్‌ జట్టుకు శ్రీలంక టీమ్ చావు దెబ్బ కొట్టింది. ఉత్కంఠభరితంగా కొనసాగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో పాక్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసి లంక జట్టు గ్రాండ్‌గా ఫైనల్‌లోకి అడుగు పెట్టింది. రేపు (ఆదివారం, సెప్టెంబర్ 13న) దుబాయ్ వేదికగా జరగనున్న హై-వోల్టేజ్ ఫైనల్లో టీమిండియాతో శ్రీలంక తలపడనుంది.

ఫాతిమా సనా ఒంటరి పోరాటం: 

దుబాయ్ వేదికగా జరిగిన ఈ నాకౌట్ పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 రన్స్ చేసి అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకుంది. కానీ శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ పాక్ బ్యాటర్లను తక్కువ స్కోరుకే పరిమితం చేసేశారు. 

హర్షిత, కవిషా మాస్ ఇన్నింగ్స్: 

131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ తగిలింది. పాక్ బౌలర్లు చెలరేగడంతో కేవలం 34 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పరాజయం దిశగా కొనసాగింది. కానీ హర్షిత సమరవిక్రమ, కవిషా దిలారి జంట బాధ్యతాయుతంగా ఆడుతూ 5వ వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు.

18.4 ఓవర్లలోనే ఫినిష్: 

హర్షిత పోరాట పటిమతో శ్రీలంక 18.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా బౌలింగ్‌లో 4 వికెట్లతో చెలరేగినప్పటికీ, జట్టును మాత్రం గెలిపించలేకపోయింది. ఈ అద్భుత గెలుపుతో లంక జట్టు ఆసియా కప్ తుది పోరుకు అర్హత సాధించింది.

ఆదివారం భారత్ వర్సెస్ లంక బిగ్ ఫైట్: 

తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత జట్టు ఇప్పటికే ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పాక్‌ను ఊచకోత కోసి లంక సిద్ధమవ్వడంతో ఆదివారం దుబాయ్‌లో జరగబోయే బిగ్ ఫైనల్‌పై భారీ హైప్ నెలకొంది. పదిసార్లు ఫైనల్‌కు చేరిన తిరుగులేని చరిత్ర ఉన్న భారత్‌కు లంక ఎలాంటి పోటీ ఇస్తుందో చూడాలి మరీ. 

©️ VIL Media Pvt Ltd.