వినాయక చవితి పండుగకు సంప్రదాయబద్ధమైన బెల్లం పాల తాలికలు సులభంగా తయారుచేసుకోండి. ఈ రెసిపీని పక్కా కొలతలు, చిట్కాలతో . కొత్తగా చేసేవారు కూడా కమ్మని, రుచికరమైన పాల తాలికలను విజయవంతంగా తయారుచేయవచ్చు. పండుగకు ఈ నైవేద్యాన్ని వినాయకుడికి సమర్పించండి.
తయారీకి కావలసినవి: రెండు టేబుల్ స్పూన్స్ సన్న సగ్గుబియ్యం, రెండు కప్పులు నీళ్లు , ఒక కప్పు బియ్యప్పిండి, పాయసం కోసం 1 కప్పు బెల్లం , రెండున్నర కప్పుల చిక్కటి పాలు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్, మూడు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, ఒక టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షను తీసుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టడం : ముందుగా రెండు టేబుల్స్పూన్ల సన్న సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో తీసుకుని, అవి మునిగేంత వరకు నీళ్లు పోసి, అరగంట నుండి గంట పాటు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల అవి త్వరగా ఉడుకుతాయి. ఒక పాన్‌లో ఒక కప్పు నీళ్లు పోసి, రెండు టేబుల్స్పూన్ల బెల్లం వేసి పూర్తిగా కరిగించండి. బెల్లంలో నలకలు ఉంటే వడగట్టుకోండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, అందులో ఒక కప్పు పొడి బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇది ముద్దలా తయారవుతుంది. ఈ ముద్దను మూతపెట్టి ఐదు నిమిషాలు పక్కన పెట్టండి.
సగ్గుబియ్యం నానబెట్టడం : ముందుగా రెండు టేబుల్స్పూన్ల సన్న సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో తీసుకుని, అవి మునిగేంత వరకు నీళ్లు పోసి, అరగంట నుండి గంట పాటు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల అవి త్వరగా ఉడుకుతాయి. ఒక పాన్‌లో ఒక కప్పు నీళ్లు పోసి, రెండు టేబుల్స్పూన్ల బెల్లం వేసి పూర్తిగా కరిగించండి. బెల్లంలో నలకలు ఉంటే వడగట్టుకోండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, అందులో ఒక కప్పు పొడి బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇది ముద్దలా తయారవుతుంది. ఈ ముద్దను మూతపెట్టి ఐదు నిమిషాలు పక్కన పెట్టండి.
బెల్లం తయారీ: మరో పాన్‌లో ఒక కప్పు బెల్లం తురుము, పావు కప్పు నీళ్లు పోసి, బెల్లం పూర్తిగా కరిగే వరకు కలపండి. బెల్లం కరిగిన తర్వాత, లో-మీడియం ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక మందపాటి గిన్నెలో ఒక కప్పు నీళ్లు, రెండున్నర కప్పుల చిక్కటి పాలు పోసి స్టవ్ మీద పెట్టాలి. పాలు వేడెక్కుతున్నప్పుడు, నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్‌లో ఉడకనివ్వండి. బియ్యప్పిండి ముద్దను కలుపుకోవడం: ఐదు నిమిషాలు పక్కన పెట్టిన బియ్యప్పిండి ముద్ద కొద్దిగా చల్లారుతుంది. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, ముద్దను బాగా మెత్తగా, సాఫ్ట్‌గా అయ్యేంతవరకు కలుపుకోవాలి. ఈ ముద్దలో నుండి నిమ్మకాయ సైజు అంత పిండిని తీసి పక్కన పెట్టండి . మిగిలిన పిండిని జంతికల గొట్టంలో పెట్టుకోండి పాలు రెండు పొంగులు వచ్చాక, జంతికల గొట్టంతో పిండిని నేరుగా మరుగుతున్న పాలలో తాలికలుగా ఒత్తుకోవాలి. అన్ని తాలికలు వేసిన తర్వాత, వెంటనే కలపకుండా ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలి. కలిపితే విడిపోయే అవకాశం ఉంది.
పక్కన పెట్టిన నిమ్మకాయ సైజు బియ్యప్పిండి ముద్దను ఒక గిన్నెలోకి తీసుకుని, అర కప్పు కాచి చల్లార్చిన పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.తాలికలు ఉడికాయో లేదో స్పూన్‌తో నొక్కి చూసి నిర్ధారించుకోండి. ఇప్పుడు, ముందుగా కలిపి పెట్టుకున్న పిండి-పాల మిశ్రమాన్ని పాలలో పోస్తూ నిదానంగా కలపండి. లో ఫ్లేమ్‌లో నాలుగైదు నిమిషాలు ఉడికించి, పాయసం చిక్కబడనివ్వండి. పాయసం బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, కొద్దిగా ఆరనివ్వాలి. పాయసం గోరు వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లం సిరప్‌ను వడగట్టి పోయాలి. వేడిగా ఉన్నప్పుడు పోస్తే పాలు విరిగిపోయే అవకాశం ఉంది. అర టీస్పూన్ యాలకుల పొడి వేసి నిదానంగా కలపండి. ఒక చిన్న పాన్‌లో ఒక టేబుల్‌స్పూన్ నెయ్యి వేడిచేసి, జీడిపప్పులను లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. ఆ తర్వాత ఎండు ద్రాక్ష వేసి ఉబ్బేవరకు వేయించి, నెయ్యితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని పాల తాలికల పాయసంలో వేసి నిదానంగా కలపండి.




