Reading Time: < 1 minute

విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసియా కప్ ఫైనల్.. పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లంక చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Caption of Image.

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: చిన్న లక్ష్య ఛేదనలో నిలకడగా ఆడిన శ్రీలంక.. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. హర్షిత సమరవిక్రమ (36), కావిషా దిల్హారి (33) మెరుగ్గా ఆడటంతో.. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో లంక 4 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 130/5 స్కోరు చేసింది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాతిమా సనా (47 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. షావల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జుల్ఫికర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (24), గుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెరోజా (21), టుబా హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (12 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఫర్వాలేదనిపించారు.

మునీబా అలీ (2), ఆయేషా జాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (7) నిరాశపర్చారు. చామరి ఆటపట్టు, చాముడి ప్రభోద చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత లంక 18.5 ఓవర్లలో 132/6 స్కోరు చేసి నెగ్గింది. చివర్లో ఇమేషా దులానీ (22), నీలాక్షిక సిల్వ (13 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), కౌశిని (14 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) వేగంగా ఆడారు. ఫాతిమా సనా 4 వికెట్లు తీసిన పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గట్టెక్కించలేకపోయింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఇండియా.. శ్రీలంకతో తలపడుతుంది.

©️ VIL Media Pvt Ltd.