Reading Time: < 1 minute

దేశానికే ఆదర్శంగా తెలంగాణ కులగణన:భట్టి విక్రమార్క

Caption of Image.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శంగా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కులగణపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన..  కులగణన అంశంపై బీజేపీ సభ్యులు పార్టీలకు అతీతంగా మాట్లాడితే మంచిదని సూచించారు.తెలంగాణ ప్రభుత్వం పక్కాగా కులగణన చేపట్టిందని, తెలంగాణ మోడల్‌ను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని ఆయన కోరారు. జనగణనలోనే పక్కాగా కులగణన చేపట్టాలని తాము ఆశించామని, అయితే జనగణనలో కులగణన చేయకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని భట్టి విక్రమార్క విమర్శించారు.

బీసీ గణనపై కేంద్రాన్ని ప్రశ్నించిన మంత్రి పొన్నం

బీసీల గణనను కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేపట్టడం లేదని మంత్రి పొన్నం ప్రశ్నించారు. బీసీ బిడ్డ బండి సంజయ్‌ను ఎందుకు పదవి నుంచి తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న వ్యక్తిని అధ్యక్షుడిగా చేశారని ఆయన విమర్శించారు.

జనగణనలో కులగణనపై బీజేపీ వైఖరి చెప్పాలి: వాకిటి శ్రీహరి

జనగణనలో కులగణన చేయాలా? వద్దా? అనే విషయంపై బీజేపీ తన వైఖరిని స్పష్టం చేయాలని వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు. తెలంగాణలో నిర్వహించిన సర్వేలో ప్రతి కుటుంబం సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిందని తెలిపారు.

 

©️ VIL Media Pvt Ltd.