
MSI Cyborg 15 Max C2W vs C13W: ప్రముఖ టెక్ సంస్థ MSI కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ సిరీస్ Cyborg 15 Maxను భారత మార్కెట్లో అధికారికంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త లైనప్‌లో MSI Cyborg 15 Max C2W, MSI Cyborg 15 Max C13W మోడళ్లు ఉన్నాయి. సైబర్‌పంక్ ఆధారిత డిజైన్‌తో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్‌లు గేమింగ్, మల్టీటాస్కింగ్, గ్రాఫిక్స్ ఆధారిత పనులకు అనుగుణంగా తీసుకొచ్చారు. ఈ సిరీస్‌లో 100W TGP వరకు GPU పవర్ సపోర్ట్ ఉంటుంది. CPU, NVIDIA GeForce RTX 50 సిరీస్ ల్యాప్‌టాప్ GPU కలిపి మొత్తం సిస్టమ్ పవర్ 130W వరకు ఉంటుంది. గత తరం మోడళ్లతో పోలిస్తే TGPలో 122 శాతం పెరుగుదల ఉన్నట్లు MSI వెల్లడించింది.
MSI Cyborg 15 Max C2W స్పెసిఫికేషన్లు
MSI Cyborg 15 Max C2W మోడల్‌ను భారత్‌లో రెండు కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మోడల్‌లో Intel Core 7 240H ప్రాసెసర్ అందించారు.
డిస్‌ప్లే
15.6 అంగుళాల FHD IPS డిస్‌ప్లే,1920×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 100 శాతం sRGB కలర్ కవరేజ్. 144Hz రిఫ్రెష్ రేట్ కారణంగా వేగవంతమైన గేమింగ్‌లో స్క్రీన్ మూవ్‌మెంట్ మరింత స్మూత్‌గా కనిపించే అవకాశం ఉంది. 100 శాతం sRGB కవరేజ్ ఫొటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులకు కూడా ఉపయోగపడుతుంది.
ప్రాసెసర్, గ్రాఫిక్స్
Cyborg 15 Max C2Wలో Intel Core 7 240H ప్రాసెసర్‌ను అందించారు. గ్రాఫిక్స్ కోసం రెండు ఆప్షన్లు ఉన్నాయి.
C2WF-103IN: NVIDIA GeForce RTX 5060 Laptop GPU, 8GB GDDR7
C2WE-105IN: NVIDIA GeForce RTX 5050 Laptop GPU, 8GB GDDR7
RTX 50 సిరీస్ గ్రాఫిక్స్ కార్డులు ఆధునిక గేమింగ్, రే ట్రేసింగ్, AI ఆధారిత గ్రాఫిక్స్ ఫీచర్లకు అనుకూలంగా ఉంటాయి.
RAM, స్టోరేజ్
ఈ ల్యాప్‌టాప్‌లో 16GB DDR5-5600 RAM, రెండు RAM స్లాట్లు, గరిష్ఠంగా 96GB వరకు మెమరీ సపోర్ట్. 512GB NVMe SSD, PCIe Gen4 స్టోరేజ్, రెండు M.2 SSD స్లాట్లు. రెండు M.2 స్లాట్లు ఉండటంతో భవిష్యత్తులో స్టోరేజ్‌ను అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఆడియో, కనెక్టివిటీ
ఆడియో కోసం రెండు 2W స్పీకర్లు, DTS ఆడియో ప్రాసెసింగ్, అరే మైక్రోఫోన్‌ను అందించారు. కనెక్టివిటీ ఆప్షన్లలో ఒక USB 3.2 Gen 1 Type-A పోర్ట్, రెండు USB 3.2 Gen 2 Type-A పోర్టులు, ఒక USB 3.2 Gen 2 Type-C పోర్ట్, అదనంగా, ఈ ల్యాప్‌టాప్ Windows 11 Home ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
MSI Cyborg 15 Max C13W స్పెసిఫికేషన్లు
Cyborg 15 Max C13Wలో 13th Gen Intel Core i7-13620H ప్రాసెసర్‌ను అందించారు. ఈ మోడల్ ప్రధానంగా RTX 5050 గ్రాఫిక్స్‌తో వస్తుంది.
డిస్‌ప్లే
15.6 అంగుళాల FHD IPS డిస్‌ప్లే, 1920×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 100 శాతం sRGB కలర్ కవరేజ్
ప్రాసెసర్, GPU
ఈ మోడల్‌లో:
13th Gen Intel Core i7-13620H ప్రాసెసర్, NVIDIA GeForce RTX 5050 Laptop GPU, 8GB GDDR7 గ్రాఫిక్స్ మెమరీ, Windows 11 Home ఆపరేటింగ్ సిస్టమ్, గేమింగ్‌తో పాటు వీడియో ఎడిటింగ్, 3D పనులు, రోజువారీ మల్టీటాస్కింగ్‌కు ఈ కాన్ఫిగరేషన్ ఉపయోగపడే అవకాశం ఉంది.
RAM, స్టోరేజ్
Cyborg 15 Max C13Wలో 16GB DDR5-5200 RAM, రెండు RAM స్లాట్లు, గరిష్ఠంగా 96GB వరకు మెమరీ సపోర్ట్, 512GB NVMe SSD, PCIe Gen4 స్టోరేజ్, రెండు M.2 స్లాట్లు
ఆడియో, పోర్టులు
ఆడియో సెటప్‌లో రెండు 2W స్పీకర్లు, DTS ఆడియో ప్రాసెసింగ్, అరే మైక్రోఫోన్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం ఒక USB 3.2 Gen 1 Type-A పోర్ట్, రెండు USB 3.2 Gen 2 Type-A పోర్టులు, ఒక USB 3.2 Gen 2 Type-C పోర్ట్.