Reading Time: 2 minutes

నాని ‘ది ప్యారడైజ్’కు ట్రైలర్ ఎందుకు లేదు? నేచురల్ స్టార్ చెప్పిన అసలు కారణం ఇదే!

Caption of Image.

నేచురల్ స్టార్ నాని సినిమాలంటేనే టాలీవుడ్ లో ఓ ప్రత్యేకమైన క్రేజ్. అందులో ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అదే దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ‘ది ప్యారడైజ్’పై మొదటి నుంచే భారీ హైప్ నెలకొంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ నిర్ణయం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అదే.. ‘ది ప్యారడైజ్’కు ట్రైలర్ ఉండదు. ఇదే విషయాన్ని నాని స్వయంగా ప్రకటించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 11, 2026 ) చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించింది.  ఈ సమావేశంలో ‘ది ప్యారడైజ్‌’కు ట్రైలర్ లేదని నాని  స్పష్టం చేశారు. బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడమే తమ లక్ష్యం అన్నారు. అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలంటే శ్రీకాంత్, అనిరుధ్‌తో పాటు టీమ్ మొత్తం మరో నాలుగైదు రోజులు దానిపైనే పనిచేయాలి. ప్రస్తుతం మాకు ట్రైలర్ కంటే సినిమా ముఖ్యం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని నాని తెలిపారు.

అంతేకాదు.. 18 ఏళ్ల కెరీర్‌లో తాను అత్యంత కష్టపడి చేసిన సినిమా ఇదేనని నాని చెప్పడం మూవీపై అంచనాలను మరింత పెంచింది. ‘ప్యారడైజ్’ కేవలం హింస, యాక్షన్‌తో నిండిన సినిమా కాదని.. ఇందులో తల్లీ కొడుకుల మధ్య బలమైన ఎమోషనల్ జర్నీ కూడా ఉంటుందని ఆయన వెల్లడించారు. టీజర్‌లో డైలాగ్స్ అర్థం కావడం లేదంటూ వచ్చిన కామెంట్స్‌పైనా నాని స్పందించారు.. కథలోని ప్రతిదీ ముందే చెప్పేస్తే పాత్రలోని ఆత్మ పోతుందని, సినిమాలో ప్రేక్షకులకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదని తెలిపారు.

ఇక శ్రీకాంత్ ఓదెల విషయంలో నాని చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. సినిమా కోసం టైమ్ మేనేజ్‌మెంట్‌లో తప్పు జరిగిందని స్వయంగా అంగీకరించారు.  శ్రీకాంత్ మంచితనం ఉన్న మొండివాడు అంటూ నాని ప్రశంసించారు.

 

మరోవైపు అనిరుధ్ రవిచందర్ సంగీతం, ‘ఏష నాగుల’ పాటలో కీర్తి సురేశ్ స్పెషల్ అప్పియరెన్స్, మోహన్‌బాబుతో నాని కాంబినేషన్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి.  ఇక 2 గంటల 49 నిమిషాల రన్‌టైమ్‌తో వస్తున్న ‘ది ప్యారడైజ్’కు ట్రైలర్ లేకుండానే ఇంత హైప్ రావడం విశేషం. మరి థియేటర్‌లో నాని చూపించబోయే ఆ ‘ప్యారడైజ్’ అసలు ఎలా ఉండబోతోంది? తెలియాలంటే సెప్టెంబర్ 24 వరకు వెయిట్ చేయాల్సిందే…

 

©️ VIL Media Pvt Ltd.