Reading Time: < 1 minute

OTT Thriller: ఓటీటీలోకి మలయాళం థ్రిల్లర్.. ‘ఇరట్టా’ ఫేమ్ జోజు జార్జ్ ఊచకోత.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Caption of Image.

మలయాళ సినిమాలకు తెలుగులో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో టాలెంటెడ్ యాక్టర్ జోజు జార్జ్ నటించిన యాక్షన్ డ్రామా ‘వరవు’ (Varavu) ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు షాజీ కైలాస్ తెరకెక్కించిన ఈ సినిమాకు ఏకే సాజన్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. థియేటర్లలో ప్రేక్షకులను పలకరించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11 నుంచి జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ కానుంది.

పాత పగలతో రగిలిపోయే ఊరు..

ఈ సినిమాలో జోజు జార్జ్ పొలచన్ అనే సంపన్న ప్లాంటర్ పాత్రలో కనిపించారు. చాలా కాలం క్రితం సొంత ఊరిని విడిచి వెళ్లిన పొలచన్.. జైలు నుంచి విడుదలైన తర్వాత తిరిగి గ్రామానికి వస్తాడు. అతని రాకతో అప్పటివరకు మరుగున పడిపోయిన పాత పగలు, కుటుంబాల మధ్య ఉన్న శత్రుత్వాలు మరోసారి భగ్గుమంటాయి.

►ALSO READ | Sardar 2 Review: కార్తి స్పై థ్రిల్లర్ సీక్వెల్‌ ఎలా ఉంది? ఆడియన్స్ టాక్ ఇదే!

నాలుగేళ్లుగా కనిపించకుండా ఉన్న తన తమ్ముడు విల్లీని తన చర్యలకు బాధ్యుడిగా చూపించేలా పొలచన్ ఓ పక్కా ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలో గ్రామంలోని ప్రతీకారాలు, ముఠాల మధ్య ఆధిపత్య పోరు, అవినీతి వంటి అంశాలు కథలో కీలకంగా మారతాయి. అసలు పొలచన్ లక్ష్యం ఏంటి? తన శత్రువులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? ఈ ప్రయాణంలో బయటపడే నిజాలేంటి? అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించారు.

‘జోసెఫ్’, ‘ఇరట్టా’ వంటి విభిన్నమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన జోజు జార్జ్.. ‘వరవు’లోనూ తన రస్టిక్ లుక్, యాక్షన్ సీన్స్, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నారు. షాజీ కైలాస్ తన మార్క్ మాస్ యాక్షన్ అంశాలతో సినిమాను తెరకెక్కించారు. ఇక ఇప్పుడు ‘వరవు’ సెప్టెంబర్ 11 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుండటంతో.. తెలుగు ప్రేక్షకులను ఈ యాక్షన్ డ్రామా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 

©️ VIL Media Pvt Ltd.