Reading Time: < 1 minute

రాష్ట్ర యువతకు 10 వేల విదేశీ కొలువులు !

Caption of Image.
  • పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని టామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంజయ్ జాజు ఆదేశం
  • సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలను భారీగా విస్తరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ఏడాదిలోనే రాష్ట్రానికి చెందిన 10 వేల మంది యువతకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేలా సమగ్ర కార్యాచరణను సిద్ధం చేయాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.

సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పవర్ కంపెనీ (టామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కామ్) పనితీరు, కార్యకలాపాలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశాల వారీగా, రంగాల వారీగా ఉన్న డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అంచనా వేస్తూ.. కొలవదగిన లక్ష్యాలతో కూడిన స్పష్టమైన రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూపొందించాలని స్పష్టం చేశారు.

నిరుద్యోగ యువతకు విదేశాల్లో చట్టబద్ధమైన, అత్యుత్తమ ఉద్యోగాలను అందించడమే సంస్థ ప్రధాన ధ్యేయంగా ఉండాలని, నిర్దేశిత 10 వేల మంది లక్ష్యాన్ని చేరుకోవడానికి ఫలితాల ఆధారిత విధానాన్ని అనుసరించాలని సూచించారు ఈ సమావేశంలో నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల శిక్షణ విభాగ కార్యదర్శి డి. హరిచందన టామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కామ్ సాధించిన పురోగతిని సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వివరించారు.

ఇప్పటివరకు టామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కామ్ ద్వారా 16 దేశాల్లో 14,509 మంది యువత విజయవంతంగా విదేశీ ఉద్యోగాలు సాధించినట్టు ఆమె వెల్లడించారు. ఈ సమావేశంలో టామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కామ్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతి వెస్లీతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.