
బంగారం కొనుగోలుచేసేవారికి భారీ ఊరట లభించింది. ధరలు ఒక్కసారిగా శాంతించాయి. గత కొద్ది రోజులుగా గోల్డ్ రేట్లులో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కసారిగా పెరిగి.. మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కొనుగోలు చేసేవారు కన్‌ప్యూజ్ అవుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై అనిశ్చితి నెలకొనడం, క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా ఎగిసిపడుతున్న క్రమంలో బంగారం ధరలపై ఎఫెక్ట్ పడుతోంది. అలాగే డాలర్ విలువ పెరగడం కూడా గోల్డ్ రేట్ల పతనానికి కారణమవుతోంది. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయంగా పసిడి ధరలు స్ధిరంగా కొనసాగుతుండగా… దేశంలోనూ అదే పరిస్థితి నెలకొంది.
సెప్టెంబర్ 13వ తేదీన బంగారం ధరలు
-హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,580 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,700గా ఉంది.
-విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,54,580 పలుకుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,700 వద్ద కొనసాగుతోంది.
-చెన్నైలో 24 క్యారెట్లు రూ.1,54,580గా ఉండగా.. 22 క్యారెట్లు రూ.1,41,700 వద్ద కొనసాగుతోంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,54,580 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,700గా ఉంది.
-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,730 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల బంగారం రేటు రూ.1,41,700 వద్ద కొనసాగుతోంది.
-ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,730కు లభిస్తుండగా.. 22 క్యారెట్ల బంగారం రేటు రూ.1,41,700 వద్ద ట్రేడవుతోంది.
వెండి ధరలు ఇవే..
-దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర రూ.2.45 లక్షల వద్ద ఉండగా.. నిన్న కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. పెద్దగా ధరల్లో మార్పు లేదు.
-హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2.50 లక్షల వద్ద ట్రేడవుతోంది
-చెన్నైలో కిలో వెండి రేటు రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది
-బెంగళూరులో కిలో వెండి రేటు రూ.2.45 లక్షల వద్ద ట్రేడవుతోంది.