Reading Time: 3 minutes
Sardar 2 Telugu Movie Review Rating Karthi Ps Mithran

Sardar 2 Movie: మిత్రన్ డైరెక్షన్లో కార్తీ హీరోగా వచ్చిన ‘సర్దార్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వారి కాంబినేషన్లోనే దానికి సీక్వెల్ గా ‘సర్దార్ 2’ అనే సినిమా రూపొందించారు. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించగా… నాజర్, ఆశిష్ విద్యార్థి, ఎస్. జె. సూర్య ఇతర కీలక పాత్రలలో నటించారు. సర్దార్ కి ఉన్న క్రేజ్ తో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ కూడా వర్కౌట్ కావడంతో సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

సర్దార్ 2 కథ:

సర్దార్ (కార్తీ) చనిపోయాడని భావించి అతని కొడుకు విజయ్ (కార్తీ) తన వర్క్ మీద ఫోకస్ పెడతాడు. ‘రా’ (RAW) లో పని చేస్తున్న విజయ్ క్రమశిక్షణ చర్యలలో భాగంగా పెద్దగా ప్రాముఖ్యత లేని ఒక యూనిట్ లో పనిష్మెంట్ పోస్టింగ్ కి వెళ్లి కష్టపడుతూ ఉంటాడు. అయితే తన టాలెంట్ ప్రూవ్ చేసుకుని మళ్లీ మంచి పొజిషన్ కి వెళ్లాలని భావిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఒక ఏజెంట్ ను ట్రేస్ చేసే క్రమంలో మరోసారి ‘రా’ చీఫ్ చేత డిసిప్లినరీ కమిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ క్రమంలోనే అతనికి కొన్ని సంచలన విషయాలు తెలుస్తాయి. అంతేకాక ఒక మిషన్ కోసం ‘బ్లాక్ డాగర్’ సూర్య అండ్ గ్యాంగ్ రంగంలోకి దిగిందని అర్థమై వారి మిషన్ ఏంటో కనుగొనే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే అతనికి తన తండ్రి గురించి మరికొన్ని సంచలన విషయాలు తెలుస్తాయి. అసలు ఈ బ్లాక్ డాగర్ ఎవరు? ఎందుకు ‘రా’ ఏజెంట్స్ ని టార్గెట్ చేశాడు? విజ్జు ఈ మిషన్ ను ఎలా ఫేస్ చేశాడు? అసలు ఇందులో మిషన్ డోకు అంటే ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ప్రమోషన్ కంటెంట్ కూడా ఉంది. ఇక సినిమా మొదలైన కాసేపటికి కాస్త కన్ఫ్యూజన్ లాంటి ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి ఇది మొదటి పార్ట్ కి సీక్వెల్, అంటే కంటిన్యూషన్ అనే అనిపించినా కూడా మొదటి భాగం చూసి చాలా కాలం అయినవారికి ఈ ఫీలింగ్ కలగడం సహజం. అయితే ఒక రకంగా స్పై యాక్షన్ డ్రామాకి ఉండాల్సిన అన్ని హంగులను దర్శకుడు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ హాఫ్ లో ఒక మిషన్ చుట్టూ కథ తిరగటం, ఆ మిషన్ ఏమిటి, అందులో ఎవరెవరు భాగమయ్యారు లాంటి విషయాలను ఒకటొకటిగా ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్ళాడు. ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగానే సాగుతుంది. సెకండ్ హాఫ్ మీద అంచనాలు పెంచేలా ఇంటర్వెల్ ఇచ్చారు. ఇక ఇంటర్వెల్ తర్వాత కథ కొంచెం నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది, అలాగే రొటీన్ అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. కానీ బాడీకి యాంటీబయాటిక్స్ నెమ్మదిగా అలవాటు చేస్తున్న క్రమాన్ని ఈ సినిమాలో ఎస్టాబ్లిష్ చేసిన తీరు బావుంది. నిజానికి ఈ సినిమా కోర్ పాయింట్ చాలా అద్భుతమైన పాయింట్. ఫస్ట్ పార్ట్ లో ఎలా అయితే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ప్రమాదకరమని చెప్పారో, ఈ పార్ట్ లో కృత్రిమ మాంసాహార ఉత్పత్తుల గురించి, శరీరానికి మందులను విపరీతంగా అలవాటు చేస్తున్న విధానాన్ని ఎత్తి చూపించారు. అయితే సెకండ్ హాఫ్, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ రొటీన్ అనే ఫీలింగ్ కలిగిస్తాయి. దానికి తోడు ఫస్ట్ హాఫ్ లో ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అయినా, ఆ ఎమోషన్స్ ని సెకండ్ హాఫ్ వరకు క్యారీ చేయడంలో దర్శకుడు పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయాడు. దీంతో కొంతవరకు ప్రేక్షకులు ఎంగేజింగ్ గా ఫీల్ అవ్వడం కష్టమే.

నటీనటుల విషయానికి వస్తే: కార్తీ రెండు పాత్రలలో ఇమిడిపోయాడు. అయితే ఎందుకో పెద్ద కార్తీ పాత్ర మేకప్ పరంగా కొంత కేర్ తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక ఆషికా రంగనాథ్ కి కొంత యాక్షన్ తో కూడిన నటన కనబరిచే అవకాశం దక్కింది. మాళవికా మోహనన్ కూడా తన గ్లామర్ రోల్స్ కి భిన్నంగా నటించింది. ఎస్. జె. సూర్య నటన కాస్త లౌడ్ గా ఉండడంతో కొంచెం ఓవర్ ది టాప్ ఫీలింగ్ కలిగించే అవకాశం ఉంటుంది. ఇక ఆశిష్ విద్యార్థి, నాజర్, అచ్యుత్ వంటి వారు తమ అనుభవాన్ని స్క్రీన్ మీద కనబరిచారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకి కీలకం బ్యాక్ గ్రౌండ్ స్కోర్. పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎఫెక్టివ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అయితే యాక్షన్ సీన్స్ కొంచెం ఓవర్ ది టాప్ ఫీలింగ్ కలిగించాయి, లాజిక్స్ కి మించి ఇంకేదో జరుగుతుందనే ఫీలింగ్ కలిగించారు. ఎడిటింగ్ టేబుల్ మీద కూడా ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉండవచ్చు. ఎందుకంటే రెండు గంటల 59 నిమిషాల నిడివి ఈ సినిమాకి కాస్త ఇబ్బందికర విషయమే. అయితే నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి, స్క్రీన్ మీద నిర్మాతలు పెట్టిన ఖర్చు కనిపించింది.

ఇక ఫైనల్ గా ‘సర్దార్ 2’… ఎంగేజింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్!