
రైతు హక్కుల పరిరక్షణకు కొత్త విత్తన చట్టం రాబోతోంది. ప్రస్తుతం ఉన్న పాత కాలపు విత్తన చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్త చట్టానికి సంబంధించి ప్రతిపాదనలతో ముసాయిదా చట్టాన్ని రైతుల ముందుంచింది. అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ సందర్బంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులతో శుక్రవారం సమావేశం అయ్యారు. కొత్త విత్తనం చట్టంపై రైతులు చర్చించారు. వివరాల్లోకి వెళితే..
వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. కొత్త విత్తన చట్టం ప్రకారం రైతుల హక్కులకు రక్షణ కల్పించనున్నట్లు చెప్పారు. ప్రస్తుత విత్తన రకాలపై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న విత్తన చట్టం 19866లో రూపొందించారు.అది 1983లో అమలులోకి వచ్చింది.. ప్రస్తుత పరిస్థితులకు ఇది సరిపోదన్నారు. నకిలీ,నాసిరకం విత్తనాలు, నిర్ధారణ లోపాల వంటి సవాళ్లను ప్రస్తుత చట్టం పరిష్కరించలేదన్నారు.
ప్రస్తుతం సుమారు 70 వాతం విత్తనాలు విత్తన చట్టం పరిధిలో లేవన్నారు. రాష్ట్రాల మధ్య విత్తన విధానాలు భిన్నంగా ఉన్నాయన్నారు. సాంప్రదాయ విత్తనాలను రైతులు వినియోగించడం, మార్పిడి చేసుకోవడం, అమ్మకాలపై ఎలాంటి నిషేధం లేదని వాటి నమోదు కూడా తప్పని సరికాదని అన్నారు.
రైతులకు పరిహారం
కొత్త విత్తనచట్టం ద్వారా ప్రతి రాష్ట్రంలో విత్తన భద్రతా నిధి ఏర్పాటు చేయనున్నారు. విత్తన వైఫల్యం సంభవించినపుడు 15 రోజుల్లోగా పరిహారం అందించేలా నిర్దారణ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. కస్టమర్ రక్షణ చట్టం కింద పరిహారం కోరే హక్కు రైతులకు కల్పించనున్నారు.
కొత్త చట్టం కింద అన్ని విత్తనాలు జాతీయ రిజిస్టర్‌లో నమోదు చేయడం తప్పనిసరి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త విత్తన రకాలను విడుదల చేసే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత విస్తరించనున్నారు.