
ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా ప్రముఖ శిల్పి చిన్నస్వామి రాజేందర్ (Shilpi Rajender) నేతృత్వంలో 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం సిద్ధమైంది..
ప్రతి ఏడాది ప్రత్యేక ఆకృతులు, భారీ విగ్రహాలతో భక్తులను ఆకట్టుకునే ఖైరతాబాద్ గణేష్ ఈసారి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. భారీ విగ్రహ నిర్మాణ పనులు పూర్తికావడంతో గణేష్ భక్తుల్లో సందడి నెలకొంది.
భారీ విగ్రహాన్ని దర్శించుకునేందుకు నగరం నలుమూలల నుంచి భక్తులు తరలిరానున్నారు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.