Reading Time: 2 minutes
Varun Tej: కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. ఎట్టకేలకు వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్ ఫొటోస్ ఇదిగో

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నాడు. కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుణ్ హీరోగా నటించిన కొరియన్ కనకరాజు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోనూ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే గతేడాది ఇదే తారీఖున (సెప్టెంబర్ 10) వరుణ్ తేజ్ -లావణ్యలు అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. వాయువ్ తేజ్ అనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే చాలామంది సెలబ్రిటీల్లాగే వీరు కూడా తమ కుమారుడి విషయంలో ప్రైవసీ పాటిస్తున్నారు. తమ కుమారుడి ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా బాగా జాగ్రత్తపడుతున్నారు. దీంతో ఈ మెగా ప్రిన్స్ వారసుడిని చూడాలని మెగాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకే తమ కుమారుడి ఫేస్ ను రివీల్ చేశారు వరుణ్- లావణ్య. ఇవాళ (సెప్టెంబర్ 10) వాయువ్ తేజ్ మొదటి పుట్టిన రోజును పురస్కరించుకుని తమ కుమారుడికి సోసల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారీ లవ్లీ కపుల్. ఇదే క్రమంలో తమ వారసుడి ఫొటోను కూడా సోషల్‌ మీడియా లో పంచుకున్నారు. ఇప్పటివరకు తమ కుమారుడి ఫేస్ ను రివీల్ చేయకుండా గోప్యత పాటించిన వరుణ్-లావణ్య ఈ ఫొటోల్లో మాత్రం తమ కుమారుడి ముఖాన్ని పూర్తిగా చూపించారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన మెగా అభిమానులు, నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. వాయువ్ తేజ్ చాలా క్యూట్ గా ఉన్నాడంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

‘ మై డియర్ వాయువ్ తేజ్.. నువ్వు నా ప్రపంచాన్ని అత్యంత అద్భుతంగా మార్చేశావు. నిన్ను మొదటిసారి చూడకముందే నేను నీతో ప్రేమలో పడిపోయాను. నీకు తండ్రిగా ఉండటమే నా జీవితంలో అత్యంత అందమైన విషయం. మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు, వాయువ్. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’ అని ఈ సందర్భంగా తన కుమారుడిపై తన కున్న ప్రేమకు అక్షర రూపమిచ్చాడు వరుణ్. ఇక వరుణ్ సోదరి నిహారిక కూడా వాయువ్ తేజ్ తో కలిసున్న ఫొటోలు షేర్ చేస్తూ.. ‘ మా చిన్నారి రాకుమారుడు వాయువ్ తేజ్ కు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ చుట్టూ ఎల్లప్పుడూ ప్రేమ, ఆనందం, లెక్కలేనన్ని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మునుముందు నీ ప్రయాణం మరింత అద్భుతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ తన మేనల్లుడికి బర్త్ డే విషెస్ చెప్పింది మెగా డాటర్.

కుమారుడితో వరుణ్ తేజ్, లావణ్య..

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)