Reading Time: < 1 minute
The Censor Board Has Awarded An A Certificate To The Movie Jailer 2 But Rajinikanth Not Interested To Release The Movie

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న అత్యంత క్రేజీ సీక్వెల్ ‘జైలర్ 2’. సన్ పిచర్స్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నఈ భారీ బడ్జెట్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిలీజ్ కు దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి తమిళ ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయ్యిందని, అయితే సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘A’ (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికెట్ జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రజనీకాంత్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికెట్ లభిస్తేనే థియేటర్లలో విడుదల చేయాలని, లేకపోతే సినిమా విడుదలను నిలిపివేయాలని రజనీకాంత్ స్పష్టంగా చిత్ర బృందానికి తేల్చి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ‘A’ సర్టిఫికెట్ వస్తే కుటుంబ ప్రేక్షకులు, పిల్లలు థియేటర్లకు రావడానికి ఇబ్బంది పడతారని అది సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని రజనీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సెన్సార్ సర్టిఫికెట్ వివాదంపై చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్, సెన్సార్ బోర్డు కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇకపోతే అన్ని అంచనాల నడుమ ఈ చిత్రాన్ని అక్టోబర్ 15, 2026న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయడానికి నిర్మాతలు అధికారికంగా తేదీని ఖరారు చేశారు.