Reading Time: < 1 minute
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్‌ బాస్‌!

సాధారణంగా రైలు స్టేషన్‌లో ఆగినప్పుడు బంధువులకు లగేజీ లేదా ఇతర వస్తువులు ఇవ్వడం మనం చూస్తుంటాం. కానీ, ఓ వ్యక్తి ఆగకుండా దూసుకెళ్తున్న సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లోకి పార్శిల్‌ను అందించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. పక్కా టైమింగ్‌తో అతడు చేసిన ఈ సాహసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ యూజర్ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రైల్వే ట్రాక్ పక్కన నిలబడిన ఆ వ్యక్తి, వేగంగా దూసుకొస్తున్న రైలులోని ప్రయాణికుల కోచ్‌ల వైపు ఎంతో జాగ్రత్తగా గమనించాడు. సరిగ్గా ఒక డోర్ దగ్గర చేయి ఊపుతున్న వ్యక్తిని గుర్తించిన క్షణంలో.. తన చేతిలోని ప్యాకేజీని ఏమాత్రం తడబడకుండా విసిరాడు. రెప్పపాటు కాలంలో రైలులో ఉన్న వ్యక్తి ఆ ప్యాకేజీని సురక్షితంగా అందుకున్నాడు. ఈ డెలివరీ కోసం వీరిద్దరూ ముందే ఫోన్‌లో మాట్లాడుకుని సమయం, ప్రదేశాన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆ రైలుకు ఆ ప్రాంతంలో హాల్ట్ లేకపోవడం వల్లే తన బంధువుకు కావాల్సిన పార్శిల్‌ను ఇలా వినూత్న పద్ధతిలో అందించాల్సి వచ్చిందని క్యాప్షన్‌లో పేర్కొన్నారు. కేవలం కొన్ని సెకన్లలో ముగిసిన ఈ డెలివరీ చూసేందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. ఆ వ్యక్తి అద్భుతమైన సమయస్ఫూర్తిని, కచ్చితమైన టైమింగ్‌ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. కానీ ఇలాంటి సాహసాలు మంచివి కావని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!