Reading Time: 2 minutes

నాన్‌స్టాప్‌గా 10 రోజులు.. 1,981 రన్స్: షిప్ వెళ్లిపోతుందని క్రికెట్ ఆపేసిన ఆత రెండు జట్లు!

Caption of Image.

Time less Test Cricket: ప్రస్తుత కాలంలో టెస్టు మ్యాచ్ మూడు నాలుగేళ్లలోనే ముగిసిపోతోంది. కానీ సమయ పరిమితి లేకుండా, విజేత తేలేవరకు మ్యాచ్ ఆడాలనే నిబంధనతో ఏకంగా 10 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా క్రికెట్ ఆడితే ఊహించుకోగలమా? 1939లో ఇంగ్లాండ్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య డర్బన్ వేదికగా జరిగిన టైమ్‌లెస్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత విచిత్రమైన, సుదీర్ఘమైన మ్యాచ్‌గా నిలిచిపోయింది.  

చెమటలు పట్టించిన 1,981 పరుగులు: 

డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ గ్రౌండ్‌లో మార్చి 3, 1939న ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు పరుగుల వరద పారించారు. బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 

* సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లు: తొలి ఇన్నింగ్స్‌లో 530 రన్స్, రెండో ఇన్నింగ్స్‌లో 481 పరుగులు చేసి ఇంగ్లాండ్‌ ముందు 696 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. 

* ఇంగ్లాండ్ కౌంటర్ ఎటాక్: తొలి ఇన్నింగ్స్‌లో 316 రన్స్ చేసిన ఇంగ్లాండ్, రెండో ఇన్నింగ్స్‌లో 696 పరుగుల ఛేజింగ్‌కు దిగింది. బిల్ ఎడ్రిచ్ (219), కెప్టెన్ వాలీ హామ్మండ్ (140) విధ్వంసంతో ఇంగ్లీష్ టీమ్ ఏకంగా 654/5 స్కోరు సాధించింది.

* గెలుపు ముంగిట ఇంగ్లాండ్: విక్టరీ సాధించడానికి ఇంగ్లాండ్‌కు కేవలం 42 పరుగులు మాత్రమే అవసరమైన దశలో భారీ వర్షం కురవడంతో ఆట ఆగిపోయింది.

గెలుపు ముంగిట షిప్ ఎక్కేసిన టీమ్: 

విక్టరీకి కేవలం 42 పరుగుల దూరంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టే ఈ మ్యాచ్ గెలుస్తుందని అందరూ భావించారు. కానీ ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అప్పటికే ఈ మ్యాచ్ ప్రారంభమై 12 రోజులు (రెండు రోజులు రెస్ట్ డేస్) పూర్తయ్యాయి. తమ పర్యటన ముగించుకుని లండన్ తిరుగుప్రయాణం కావడం కోసం ఇంగ్లాండ్ టీమ్ ముందుగానే కేప్‌టౌన్ నుంచి అథ్లోన్ క్యాజిలా అనే షిప్ (ఓడ) టికెట్లు బుక్ చేసుకుంది. 

ALSO READ : టీమ్‌మేట్స్‌పై కాఫీ చల్లోద్దు బాస్.. 

ఒకవేళ ఈ మ్యాచ్‌ను ఇంకా కొనసాగిస్తే, డర్బన్ నుంచి కేప్‌టౌన్ వెళ్లే రైలుతో పాటు స్వదేశానికి తీసుకెళ్లే ప్రయాణీకుల ఓడను కూడా ఇంగ్లాండ్ ప్లేయర్లు మిస్ అవ్వాల్సి వస్తుంది. దీంతో వేరే దారి లేక ఇరు జట్ల కెప్టెన్లు పరస్పర అంగీకారంతో మ్యాచ్‌ను డ్రాగా ముగిస్తున్నట్లు ప్రకటించారు. 10 రోజుల ఆట, 1,981 పరుగులు, 43 గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత కూడా విజేత ఎవరు అనేది తేలకుండానే ఈ టెస్టు ముగిసింది. కాగా క్రికెట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ మ్యాచ్‌గా గిన్నిస్ రికార్డుల్లో నిలిచిపోయింది.

©️ VIL Media Pvt Ltd.