
BeiGo X4 Electric Trike Launched: ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి మరో కొత్త వాహనం వచ్చింది. బెంగళూరుకు చెందిన EV స్టార్టప్ iGowise Mobility కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ BeiGo X4ను విడుదల చేసింది. చూడటానికి ఇది స్కూటర్, త్రీ-వీలర్ కలయికలా కనిపిస్తుంది. రెండు చక్రాల వాహనంలా మలుపులు తిప్పుకునే సౌలభ్యంతో పాటు, మూడు చక్రాల కారణంగా అదనపు బ్యాలెన్స్, స్టెబిలిటీ లభించేలా దీన్ని రూపొందించారు. కంపెనీ ప్రకారం దీని డెలివరీలు దీపావళి సమయానికి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు సుమారు 1,000 యూనిట్లను విక్రయించాలనే లక్ష్యాన్ని iGowise Mobility పెట్టుకుంది.
మొదటి 300 మందికి ప్రత్యేక ప్రారంభ ధర
BeiGo X4ను ప్రారంభంలో కేవలం మొదటి 300 మంది కస్టమర్లకు ప్రత్యేక ధరకు అందించనున్నారు. Invite-only ప్రోగ్రామ్ కింద వీరు ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని రూ.1.25 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మొదటి 300 యూనిట్లు పూర్తయిన తర్వాత BeiGo X4 ధర రూ.1.56 లక్షల (ఎక్స్-షోరూమ్)కు పెరగనుంది.
100 కి.మీ రేంజ్
BeiGo X4లో IDC సర్టిఫైడ్ 100 కిలోమీటర్ల రేంజ్ అందిస్తోందని కంపెనీ చెబుతోంది. ఇందులో iGowise రూపొందించిన HomeSwft 72V ఆర్కిటెక్చర్ ను ఉపయోగించారు. సాధారణ ఇంటి పవర్ కనెక్షన్‌తో ఈ EVను సుమారు 100 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. రోజువారీ నగర ప్రయాణాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ చెబుతోంది.
మూడు డిస్క్ బ్రేకులతో భద్రత
సేఫ్టీ కోసం BeiGo X4లో Triple-Disc Combined Braking System (CBS) అందించారు. వెనుక భాగంలో రెండు చక్రాలు ఉండటంతో రోడ్డుపై మెరుగైన గ్రిప్, ట్రాక్షన్ లభించేలా డిజైన్ చేశారు. ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్, తక్కువ వేగంతో ప్రయాణించే సమయంలో మూడు చక్రాల డిజైన్ అదనపు స్థిరత్వాన్ని అందించడమే ఈ వాహనం ప్రత్యేకతగా చెప్పొచ్చు.
యాంటీ-టాపల్ టెక్నాలజీ
BeiGo X4లో కంపెనీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన Anti-Topple Tilting Technology ఉంది. దీని వల్ల వాహనం పైభాగం రైడర్‌తో కలిసి బైక్ మాదిరిగా మలుపుల్లో వంగుతుంది. అదే సమయంలో వెనుక ఉన్న రెండు చక్రాలు వాహనానికి గ్రిప్, స్టెబిలిటీని అందిస్తాయి. తక్కువ వేగంలో, గుంతలు ఉన్న రోడ్లపై, అలాగే జారుడు మార్గాల్లో రైడర్‌కు మరింత నమ్మకాన్ని అందించడమే ఈ టెక్నాలజీ లక్ష్యమని కంపెనీ చెబుతోంది.
1.5 లక్షల కిలోమీటర్ల టెస్టింగ్
BeiGo X4 అభివృద్ధి కోసం iGowise Mobility ఐదేళ్లకు పైగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేసినట్లు తెలిపింది. ఈ సమయంలో 50కి పైగా ప్రోటోటైప్‌లను రూపొందించి పరీక్షించినట్లు కంపెనీ పేర్కొంది. భారతదేశంలోని వివిధ రకాల రోడ్లపై ఈ వాహనాన్ని సుమారు 1.5 లక్షల కిలోమీటర్ల మేర టెస్ట్ చేసినట్లు వెల్లడించింది.
ARAI, ICAT సర్టిఫికేషన్లు
BeiGo X4కు ICAT, ARAI సర్టిఫికేషన్లు లభించినట్లు కంపెనీ తెలిపింది. ఈ వాహనం CMVR నిబంధనలు, AIS-156 బ్యాటరీ సేఫ్టీ స్టాండర్డ్స్ కు అనుగుణంగా ఉన్నట్లు పేర్కొంది. అంతేకాకుండా వాహనం డిజైన్, బ్యాలెన్సింగ్ టెక్నాలజీకి సంబంధించి iGowise వద్ద 12 పేటెంట్లు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.
నగర ప్రయాణాలకు కొత్త ఆప్షన్
iGowise Mobility ఫౌండర్ శ్రవణ్ అప్పన్న ప్రకారం, చిన్న ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ ఎనర్జీని వినియోగించడంతో పాటు రోడ్లపై తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. భారీ EVలతో పోలిస్తే చిన్న బ్యాటరీతోనే రోజువారీ ప్రయాణ అవసరాలను తీర్చగలవని కంపెనీ అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో రోజువారీ ఆఫీస్, మార్కెట్, ఇతర చిన్న దూర ప్రయాణాలకు BeiGo X4 ఒక కొత్త ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది.